Viral Video : వీడు నా య‌జ‌మాని.. నేను వీడికి ప‌ర్సన‌ల్ ట్రైన‌ర్ ని.. ఈ పిల్లి బిల్డ‌ప్ చూడండి

Authored By mallesh | The Telugu News | Published on: April 3, 2022, 7:40 am

Viral Video : పిల్లుల‌ను మ‌న రోజూ చూస్తూనే ఉంటాం. ఎప్పుడూ ఇంట్లోనే తీరుగుతూ ఉంటాయి. పెంపుడు పిల్లులు చిన్న‌పిల్ల‌ల‌తో ఆడుకుంటాయి. అట‌ప‌ట్టిస్తాయి. మనం చేసే ప‌నుల‌ను కూడా అనుక‌రిస్తుంటాయి. పిల్లులు చాలా ఆసక్తికరమైన జంతువులు వాటి నుంచి మ‌నం చాలా నేర్చుకోవచ్చు. పిల్లులు చాలా తెలివైనవి కూడా . అయితే పిల్లులు కుక్క అంత కాక‌పోయినా య‌జ‌మానితో స్నేహ‌పూర్వ‌కంగా ఉంటాయి. చిన్న చిన్న ప‌నుల్లో స‌హాయ‌ప‌డుతుంటాయి. మ‌న‌తోనే ఉంటూ మ‌న‌తోనే ప‌డుకుంటాయి.కుక్కలు, పిల్లుల చేష్టలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తూ ఉంటాయి.

దాదాపు చాలా మంది ఇళ్లలో కుక్కలు, పిల్లులు ఉండడం సహజమే. రోజూ వాటి అల్లరి చూసి చాలాసార్లు విసుగొచ్చినా.. కొన్నిసార్లు మాత్రం వాటి చేష్టలు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అందులోనూ పిల్లులు ఒక్కోసారి మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. యజమాని భోజనం చేసే సమయంలో దగ్గరికి వచ్చి తనకూ కావాలని అన్నట్లుగా ప్రవర్తించే తీరు. అలాగే కొన్ని పిల్లులు దొంగతనంగా పాలు తాగే తీరు చూడటానికి విచిత్రంగా ఉంటుంది.అయితే కొన్ని పిల్లులు మ‌నం ఏది చేస్తే అది అనుక‌రిస్తుంటాయి. ప్ర‌స్తుతం ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Pushups with owner in Cat Video Viral 

Pushups with owner in Cat Video Viral

అదేంటంటే త‌న య‌జ‌మాని పుష‌ప్స్ కొడుతుండ‌గా పిల్లి త‌న కాలితో ఆ య‌జ‌మానిని కింద‌కి నెడుతుంది. ఆ పిల్లి ద‌గ్గ‌రుండి మ‌రి య‌జ‌మానితో పుష‌ప్స్ కొట్ట‌పిస్తున్న‌ట్లు ఉంది. కొన్ని పిల్లులు జిమ్ కి వెళ్లి క‌స‌ర‌త్తులు కూడా చేస్తుంటాయి. అంటే ఇంట్లోనే అనుకోండి .. ఇలా ఇవి చేసే ప‌నులు చూస్తే తెగ న‌వ్వొచ్చేస్తుంది. నెటిజ‌న్లు కూడా ఈ పిల్లి పై జోకులు వేస్తున్నారు. ఈ పిల్లి ప‌ర్సనల్ ట్రైన‌ర్.. సో క్యూట్ అంటూ కామెంట్లు చేస్తూ లైకులు కొడుతున్నారు. మీరు కూడా ఈ వీడియోని ఓ లుక్కెయండి..

 

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp