Rains : మంట క‌లిసిన మాన‌వ‌త్వం.. రూ.10వేలు ఇస్తేనే కాపాడుతానంటూ డిమాండ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :2 September 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Rains : మంట క‌లిసిన మాన‌వ‌త్వం.. రూ.10వేలు ఇస్తేనే కాపాడుతానంటూ డిమాండ్..!

Rains : ఈ రోజుల్లో మ‌నిషి ప్రాణాల క‌న్నా కూడా డ‌బ్బుకే చాలా మంది విలువ ఇస్తున్నారు. మ‌నుషులు చావు బ‌తుకుల మధ్య ఉన్నా కూడా కొంద‌రు దురాశ వ‌ల‌న మాన‌వ‌త్వాన్ని మ‌రిచిపోతున్నారు. మనిషి ప్రాణాల కన్నా డబ్బుకే ఎక్కువ విలువ ఇచ్చే దురాశపరుడి వల్ల ఓ వ్యక్తి గంగా నదిలో మునిగి, ప్రాణాలు కోల్పోయారు. కాపాడేందుకు 10వేలు డిమాండ్ చేశాడు ఓ గజ ఈతగాడు.. ఇందుకు అంగీకరించిన బాధితుడు బంధువులు ఆన్‌లైన్‌లో డబ్బు బదిలీ చేశారు. కానీ, మనీ ట్రాన్స్‌ఫర్‌ అయ్యేందుకు సమయం పట్టింది. డబ్బులు ముడితేనే మనిషిని కాపాడేది అని ఆ గజ ఈతగాడు తేల్చి చెప్పాడు. ఇంతలోనే నదిలో పడ్డ వ్యక్తి వరద ఉధృతికి కనిపించకుండా కొట్టుకుపోయాడు. ఈ విషాద సంఘటన యూపీలో చోటు చేసుకుంది.

Rains మ‌నిషేనా అత‌ను..

పూర్తి వివరాల్లోకి వెళితే… మీడియా కథనాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌ ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఆదిత్య వర్ధన్‌ సింగ్‌ ఆదివారం తన మిత్రులతో కలిసి ఉన్నావ్‌లోని నానామావ్‌ ఘాట్‌ వద్ద గంగా నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. అనుకోకుండా ప్రవాహం పెరగడంతో ఆయన నీటిలో మునిగిపోయారు.అక్కడే ఉన్న గజ ఈతగాడు సునీల్‌ కాశ్యప్‌ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. కానీ, అందుకోసం డబ్బు డిమాండ్ చేశాడు. ఆన్‌లైన్‌లో రూ.10,000 తనకు బదిలీ అయ్యే వరకు తాను బాధితుడిని కాపాడబోనని చెప్పాడు.

Rains : మంట క‌లిసిన మాన‌వ‌త్వం.. రూ.10వేలు ఇస్తేనే కాపాడుతానంటూ డిమాండ్..!

Rains : మంట క‌లిసిన మాన‌వ‌త్వం.. రూ.10వేలు ఇస్తేనే కాపాడుతానంటూ డిమాండ్..!

సదరు అధికారి సింగ్‌ నదిలో కొట్టుకుపోతూ ఉంటే, రూ.10,000 తనకు బదిలీ అయ్యే వరకు సునీల్‌ వేచి చూశాడు. దీంతో ఆయన నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తర్వాత ఉన్నతాధికారులు ఘటనాస్థలిని సందర్శించారు. గల్లంతైన సింగ్‌ కోసం డైవర్లు బోటులో వెతికారు. అయితే, మృతదేహం లభ్యం కాలేదని, గాలింపు కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే గ‌జ ఈత‌గాడి గురించి తెలుసుకున్న వారంతా కూడా ఆయ‌న‌ని తెగ తిట్టిపోస్తున్నారు.

Tags :

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి