Viral Video : పిల్లిని ఆటపట్టించిన ఉడుత.. వీడియో వైరల్!
Viral Video : మన ఇంట్లో లేదా చుట్టూ పక్కల ఇళ్లల్లో పెట్స్ ఉంటే ఆ సందడే వేరు. ఎప్పుడు అరుపులు వినిపిస్తూనే ఉంటాయి. ఉరుకులు, పరుగుల మధ్య వాటితో మనం గడుపుతుంటే అసలు టైం తెలీదంటే అతిశయోక్తి కాదు. చాలా మంది తమ ఇళ్లల్లో పిల్లులు, కుక్కలు, కుందేళ్లు, చిలుకలను పెంచుకుంటుంటారు. కుక్కలు మాత్రం విశ్వాసానికి మారుపేరు. కొందరైతే తమ ఇంటికి కాపలా కోసం కుక్కలను పెంచుకుంటుంటే మరికొందరు మాత్రం తమకు తోడుగా పెంచుకుంటుంటారు. శునకాలు ఎప్పుడూ ఇంట్లోనే ఉండి యజమానుల పట్ల చాలా విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంటారు. అందుకే ఒక్కోసారి నమ్మకానికి బెస్ట్ ఉదాహరణగా కుక్కల గురించి అభివర్ణిస్తుంటారు. కానీ పిల్లులు మాత్రం కేవలం అల్లరి మాత్రమే చేస్తుంటాయి.
కొందరు పిల్లులను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. యానిమల్ లవర్స్ అయితే తమకు నచ్చిన క్యాట్స్‌ను విదేశాల నుంచి కూడా తెప్పించుకుంటుంటారు. పిల్లులు ఇంట్లో టామ్ అండ్ జెర్రీ కార్టూన్ కళ్లముందే కదలాడుతుంది. ఎలుక కనిపించిందంటే చాలు వెంటాడుతుంది. అది పరిగెత్తెటప్పుడు ఏది అడ్డుగా ఉన్నా తోసుసుకుంటు వెళ్లిపోతుంది. ఫలితంగా ఇళ్లు మొత్తం పెంట పెంట అవుతుంది. జంతువులపై ఉన్న ప్రేమతో ఓనర్స్ కూడా ఓపికగా భరిస్తుంటారు. అయితే, కొన్ని యానిమల్స్ మధ్య మంచి బంధం ఉంటుంది. పిల్లులు బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ వంటివని కొందరు చెబుతుంటారు. ఎప్పుడు పడుకునే ఉంటాయి. కొన్ని మాత్రమే యాక్టివ్‌గా ఉంటాయి.

the squirrel that teased cat
Viral Video : నవ్వు తెప్పిస్తున్న పిల్లి, ఊడుత ఆటలు
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ ఉడుత పిల్లి వీపు మీదకు ఎక్కి దానికి తెగ ఆటపట్టించింది. ఈ ఫన్నీ ఘటను లవర్ పవర్ అనే ట్విట్టర్ నుంచి షేర్ చేయబడింది. ‘కన్ ఫ్యూసుడ్ కిట్టీ’వీడియోకు లైన్ రాసి ఉంది. ఉడుత తన వీపు ఉన్నది తెలీక దాని కోసం పిల్లి గింగిరాలు తిరుగుతూ వెతుకుతుంటుంది. ఇది అందరినీ మెప్పిస్తోంది. నెటిజన్లు ఈ వీడియోను చూసి చాలా ఏంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.
confused kitty! ????????????????????pic.twitter.com/FxkEL9lWYQ
— LovePower (@LovePower_page) January 12, 2022