Viral Video : పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రియుడి దగ్గరికి వచ్చి శవమైపోయిన ప్రియురాలు వీడియో వైరల్..!!

Advertisement

Viral Video : ప్రస్తుత రోజుల్లో ప్రేమ అనేది చాలా కల్తీ అయిపోయింది. అది తల్లిదండ్రుల బిడ్డల మధ్య అయినా భార్యాభర్తల మధ్య అయినా ఇంకా వేరేది ఏదైనా గాని.. స్వచ్ఛమైన ప్రేమ అనేది చాలా కష్టమైపోతోంది. ఏదైనా ప్రేమ అవతల వ్యక్తి చూపిస్తున్నాడంటే.. దాని వెనకాల ఒక స్వార్థం కూడా ఉన్న పరిస్థితులు నేటి సమాజంలో కనిపిస్తున్నాయి. దీంతో నిజమైన ప్రేమ అని లొంగిపోయిన చాలామంది తమ జీవితాలను ప్రమాద పరిస్థితుల్లోకి నెట్టేసుకుంటున్నా రు. ఈ రకంగానే హర్యానాలో ఉన్నత చదువులు చదివి విదేశాలలో స్థిరపడిన ఓ అమ్మాయి.. మోసపోయి ప్రాణాలు పోగొట్టుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే హర్యానాలో ఒక గ్రామానికి చెందిన 23 ఏళ్ల నీలం.. సునీల్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది.

Advertisement

Advertisement

అయితే ఉన్నత చదువులు చదివిన నీలంకీ ఉద్యోగం రావడంతో కెనడా వెళ్లిపోకుంది. అయినా వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకున్నారు. గత ఏడాది జనవరి సునీల్ పెళ్లి చేసుకుందాం ఇద్దరం ఇంకా కలిసి బతుకుదామని.. నీలంకి ఫోన్ చేయడం జరిగింది. దీంతో ప్రియుడుతో కలిసి బతకాలని ఎన్నో కలలతో.. కెనడా నుండి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత నీలం కనిపించకుండా పోయింది. ఇదే సమయంలో సునీల్ కూడా కనిపించకపోవడంతో నీలం కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో నీలం చెల్లి రోషిని… పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. నీలం కనిపించకుండా పోయిన కేసును కిడ్నాప్ కేసుగా పరిగణించిన పోలీసులు ఆ తర్వాత ఈ కేసును పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.

The video of the girlfriend who died after coming to her boyfriend who said she would marry him has gone viral
The video of the girlfriend who died after coming to her boyfriend who said she would marry him has gone viral

దీంతో నీలం కుటుంబ సభ్యులు హర్యానా హోం మంత్రి దృష్టికి కేసును తీసుకెళ్లడం జరిగింది. దీంతో హర్యాన ప్రభుత్వం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి ఈ కేసును అప్పగించడం జరిగింది. వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు రంగంలోకి దిగి.. ప్రియుడు సునీల్ నీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అధికారుల విచారణలో నీలంనీ తానే హత్య చేసినట్లు సునీల్ అంగీకరించటం జరిగింది. నీలం తలపై గన్ తో రెండు బుల్లెట్లతో కాల్చడం జరిగిందని చంపేసినట్లు అసలు విషయం బయటపెట్టారు. అంతేకాకుండా నీలం డెడ్ బాడీని తన పొలంలో కపెట్టినట్లు సునీల్ తెలియజేయడం జరిగింది. దీంతో ఇన్వెస్టిగేషన్ అధికారులు సునీల్ పొలంలో డెడ్ బాడీని బయటకు తీసి డిఎన్ఏ పరీక్ష చేసి.. అన్ని సాక్షాదారాలు సేకరించి సునీల్ కి శిక్ష పడేలా చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో నీలం మృతి పై చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement