Ganesh Mandap : గణేష్ మండపాలను సైతం వదలని దొంగలు .. సెల్ ఫోన్ల చోరీకి యత్నం ..!

Authored By aruna | The Telugu News | Published on: September 23, 2023, 11:00 am

Ganesh Mandap : హిందువుల పండుగలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ గణేష్ చతుర్థి. చిన్నపిల్లలనుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ ఇది. ప్రస్తుతం ఈ పండుగను దేశమంతటా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అయితే కొందరు దొంగలు దేవుడంటే భయం, భక్తి లేకుండా గణేశుడు మండపాల పైన దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. టెక్నాలజీ ఎంతో పెరుగుతున్న దొంగలు మాత్రం దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నా ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉంటున్నాయి.

దొంగతనం చేస్తూ దొరికిపోతాం అని తెలిసి కూడా దొంగలు చోరీ చేయటానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఓ దొంగ గణేష్ మండపంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ దొంగతనం నిన్న అర్ధరాత్రి జరిగింది. ఈ వీడియోలో కొందరు యువకులు గణేష్ మండపం పైన నిద్రిస్తున్నారు. ఆ సమయంలో ఓ దొంగ తన మొహాన ముసుగు వేసుకొని మండపం మీదికి ఎక్కాడు. సెల్ ఫోన్లు పక్కన పెట్టుకొని నిద్రిస్తున్న ఆ యువకులను జాగ్రత్తగా గమనిస్తూ ఫోన్ లను సైలెంట్ గా తీసుకున్నాడు .

Thieves attempt steal cell phones in Ganesh Mandap

Thieves attempt steal cell phones in Ganesh Mandap

ఇంతలోనే ఓ యువకుడికి మెలకువ రావడంతో నిద్రలేచి చూసాడు. ఇది చూసిన దొంగ పారిపోయాడు. అలికిడికి మండపం మీద నిద్రిస్తున్న యువకులంతా లేచి దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ దొంగ దొరకలేదు. అయితే ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో చిక్కింది. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు . రెండు రోజుల క్రితం వియాపూర్‌లోని ఓ గణేష్ మండపంలో లడ్డూ దొంగతనం జరగగా ఈరోజు ఉదయం 1:50 గంటలకు మేడ్చల్ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఈ చోరీ జరిగింది.

Also read

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp