Viral Video : గుండెపోటుతో కుప్పకూలిన యువకుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్.. ఎక్కడో తెలుసా?
Viral Video : ఈరోజుల్లో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వాళ్లను ఎందరినో చూస్తున్నాం. మాట్లాడుతూనే, నడుస్తూనే సడెన్ గా కుప్పకూలిపోవడం, గుండెపోటుతో క్షణాల్లో మృతి చెందడం సర్వసాధారణం అయింది. దానికి కారణం మన లైఫ్ స్టయిల్, మన ఫుడ్, ఇతర అంశాలు. ఏది ఏమైనా 20 ఏళ్ల వయసు నుంచే గుండె పోటు రావడం అనేది కామన్ అయింది. ఏ వయసు వారికి ఎప్పుడు గుండె పోటు వస్తుందో ఊహించలేనంతగా ఉంది. ఇటీవల గుండెపోటుతో చాలామంది ప్రముఖులు చనిపోయారు.
తాజాగా ఓ యువకుడు గుండెపోటుతో రోడ్డు మీద కుప్పకూలిపోయాడు. దీంతో అతడికి సీపీఆర్ చేసి చావు బతుకుల్లో ఉన్న ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు ఓ కానిస్టేబుల్. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తాలో చోటు చేసుకుంది. గుండెపోటుతో రోడ్డు మీద కుప్పకూలిన బాలరాజు అనే వ్యక్తిని అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ సీపీఆర్ చేసి ప్రాణం కాపాడాడు.
Viral Video : గుండెపోటుతో రోడ్డు మీద కుప్పకూలిన బాలరాజుకు సీపీఆర్ చేసిన కానిస్టేబుల్ రాజశేఖర్
ఏమాత్రం ఆలస్యం అయినా బాలరాజు ప్రాణాలు పోయేవి. క్షణాల్లో స్పందించి అతడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు బాలరాజు ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైబరాబాద్ ట్రాఫిక్ ఫోలీస్ విభాగం తన ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది.
https://twitter.com/CYBTRAFFIC/status/1629000555686416384