viral video : పిల్లి వర్సెస్ పావురం బిగ్ ఫైట్.. చివరికి ఏం జరిగిందంటే… వీడియో
viral video : ప్రస్తుత సమాజంలో మనుషుల్లో విలువలు తగ్గిపోయాయి. నమ్మడాన్ని వదిలేసి అనుమానాన్ని వెంటపెట్టుకుని తిరుగుతున్నారు. మనస్ఫూర్తిగా ఫ్రెండ్ షిప్ కూడా చేయడం లేదు. దీనికి తోడు నమ్మని వారిని మోసం చేసే వారు ఎక్కువ తయారయ్యారు. కానీ జాలీ, ప్రేమ, ఫ్రెండ్ షిప్‌లో మనుషులకు జంతువులు, పక్షులు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పంది పిల్లకు కుక్క పాలివ్వడం, కోతిపిల్లతో కుక్క ఫ్రెండ్ ఫిప్ చేయడం వంటి చాలా వీడియోలు మనం చూసే ఉంటాం. వాస్తవానికి కోతికి, కుక్కకు అసలు పడదు. కానీ ఆ రెండు కలిసి చాలా జాలీగా ఆడుకుంటూ ఎంజాయ్ చేసిన వీడియో గతంలో చాలా వైరల్ అయింది. ప్రస్తుతం అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది.
viral video.. సోషల్ మీడియాలో వైరల్..
పిల్లి, పావురం ఒకదానితో ఒకటి ఎంచక్కా ఆడుకుంటున్నాయి. ఒకదానిని మరొకటి కొరుకుతూ, కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాయి. పావురం ఒక చోట గుండ్రంగా తిరిగగా దానిని పిల్లి చేతితో కొట్టింది. అందుకు కోపమొచ్చిన పావురం పిల్లిని పొడుస్తూ కాసేపు కాలక్షేపం చేసింది. ఆ తర్వాత పిల్లి పావురాన్ని కొరుకుతూ సరదాగా ఆటపట్టించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్స్ వీటి స్నేహాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఏమైనా మంచి స్నేహితులు దొరకాలంటే అదృష్టం ఉండాలని అంటూ మరికొందరు అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కెయ్యండి.. మీరూ కూడా ఒత్తిడి నుంచి కాస్త రిలీఫ్ అవుతారు.