Viral Video : మేకను చుట్టేసిన కొండచిలువ .. కాపాడేందుకు ప్రయత్నించిన పిల్లలు .. చివరికి ఏమైందంటే… వీడియో ?
Viral Video : సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని వీడియోలు చూస్తే భయం అనిపిస్తుంది. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. ఇంకా మరికొన్ని వీడియోలు వినోదాత్మకంగా ఉంటాయి. భూమి మీద చాలా ప్రమాదకరమైన జీవులు ఉన్నాయి. వాటిలో ఒకటి కొండచిలువ. ఎలాంటి జీవులనైనా సరే అమాంతం చుట్టేసి మింగుతాయి. ఒక్కసారి వీటిని బారిన పడితే తప్పించుకోవడం చాలా కష్టం. ఈ క్రమంలో ఒక మేక కూడా కొండచిలువ బారిన పడి తప్పించుకోవడానికి నానా తిప్పలు పడింది.
గడ్డిమేస్తున్న మేకల గుంపు దగ్గరకు వచ్చి ఓ కొండచిలువ అవకాశం చూసి ఓ చిన్న మేక పిల్లను చుట్టేసింది. మేకకి ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసింది ఆ కొండచిలువ. మింగటానికి ప్రయత్నం చేస్తుండగా మేక తీవ్రంగా ప్రతిఘటించింది. దాన్ని బారి నుంచి తప్పించుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నించింది. కొండచిలువ మాత్రం దాన్ని వదిలిపెట్టకుండా మరింత గట్టిగా పట్టుకుంది. ఇక మేక తన ప్రాణాలను మెల్లమెల్లగా వదిలేసుకుంటుంది. ఈ సమయంలో అక్కడికి వచ్చిన కొందరు పిల్లలు దీన్ని గమనిస్తారు. మొదట కొండ చిలువను చూసి భయంతో అలా ఉండిపోతారు. అయితే దాని చేతిలో చిక్కుకున్న మేకప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తారు.
భయపడుతూనే దగ్గరలో ఉన్న కట్టే పుల్లలను తీసుకొని కొండచిలువను కొడతారు. ఒకరు తోకను, మరొకరు తలను పట్టుకొని కొండచిలువ బారి నుండి మేకను విడిపించడానికి ప్రయత్నిస్తారు. చివరకు ఎలాగోలా కొండచిలువను పక్కకు లాగేసి దానిని కాపాడతారు. దీంతో మేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చూసిన కొందరు విభిన్న కామెంట్లను పంచుకున్నారు. కొందరు పిల్లల ధైర్యాన్ని మెచ్చుకుంటే మరికొందరు వీడియోల కోసం కావాలనే ఇలా చేస్తున్నారని తీవ్రంగా మండిపడుతున్నారు. వ్యూస్ కోసం పిల్లలను, మూగజీవాలను ఇబ్బంది పెట్టడం సరికాదని కొంతమంది అంటున్నారు.