Viral Video : పెన్సిల్ పోయిందని కేసు పెట్టడానికి పోలీస్ ష్టేషన్ వచ్చిన బుడ్డొళ్లు.. వైరల్ వీడియో
Viral Video : ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు, లేదా గొడవ జరిగినప్పుడో సాధారణంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కొన్ని సందర్భాల్లో డబ్బులు ఎగొట్టినప్పుడో.. ఎవరైనా మోసం చేసినప్పుడు పోలీసులను ఆశ్రయిస్తారు ఇది కామన్.. దీంతో పోలీసులు కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేస్తారు. నిందితులను పట్టుకుని అరెస్ట్ చేస్తారు. ఇదంతా రెగ్యులర్ గా జరిగే కథ.. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇద్దరు బుడ్డొళ్ల పెన్సిల్ పంచాయితీకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
Viral Videol : కేసు పెట్టండి సారు..
బడి పిల్లల్లో కొందరు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అందులో ఒక పిల్లోడి పేరు హనుమంతు.. రెండో పిల్లోడి పేరు కూడా హనుమంతే.. ఇగ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న వీరిద్దరు పోలీసుల ముందు పంచాయితీ చెప్పుకొచ్చారు. నేను హోం వర్క్ చేసుకుంటుంటే వీడు నా పెన్సిల్ తీసుకుని పోయాడు సారు అంటూ ఒక పిల్లోడు పోలీసుల ముందు వాపోతున్నాడు. అయితే రెండో పిల్లోడు మాత్రం.. ఆ పెన్సిల్ ను అతనికే ఇచ్చేశాను సార్ అంటూ చెప్పాడు.
ఇక బాధిత పిల్లోడు మాత్రం ‘నా పెన్సిల్ ములికిలు తీసుకున్నడు సర్.. కేసు పెట్టండి.. రోజు దొంగతనం చేస్తడు.. పెన్సిల్, దుడ్లు అన్నీ తీసుకుంటడు..’ అని చెబుతుంటాడు. మరి బెయిల్ దొరుకుడు కష్టమని పోలీసులు చెబుతారు. చివరకు వారిద్దరిని కాంప్రమైజ్ చేశారు పోలీసులు. చేతులు కలుపుకుని ఫ్రెండ్స్ గా ఉండాలని సూచించి వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://www.youtube.com/watch?v=-EYJqv161R8