Viral Video : వావ్.. కంప్యూటర్‌లో గేమ్ ఆడుతున్న డాగ్.. మధ్యలో కీ బోర్డును ఏం చేసిందంటే?
Viral Video : ప్రస్తుత ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ప్రతీ ఒక్కరు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మారుమూల గ్రామంలో ఉన్న వ్యక్తులు సైతం స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. కంప్యూటర్ యూసేజ్ గురించి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జంతువులకు సైతం టెక్నాలజీ గురించి తెలుపుతున్నారు. అలా కంప్యూటర్‌లో గేమ్ ఆడటం నెర్చేసుకున్న ఓ డాగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ సదరు వీడియోలో పెంపుడు కుక్క ఏం చేసిందంటే..

viral video dog playing game in computer video got viral
Viral Video : డాగ్ సీరియస్‌గా గేమ్ ఆడుతుండగా డిస్ట్రబ్ చేసిన వ్యక్తి.. దాంతో కుక్క అలా చేసింది..
వైరలవుతున్న సదరు వీడియోలో డాగ్, దాని ఓనర్ అయిన ఓ వ్యక్తి చైర్‌పైన కూర్చొని ఉన్నారు. వారి ఎదురుగా టేబుల్‌పైన కంప్యూటర్ ఉంది. గేమ్ ఆన్ చేసి ఉండగా, పెంపుడు కుక్క ముందరున్న తన రెండు కాళ్లతో కీ బోర్డును పట పట ప్రెస్ చేస్తూనే ఉంది.
కంప్యూటర్ స్క్రీన్ చూస్తూ హ్యాపీగా కీ బోర్డును ప్రెస్ చేస్తోంది. అంతలోనే కంప్యూటర్ ఓనర్ అయిన సదరు వ్యక్తి గేమ్ ఆఫ్ చేశాడు. అంతే డాగ్‌కు కోపం వచ్చేసింది. ఆ వ్యక్తి వైపు చూసి తన ఆగ్రహాన్ని కీ బోర్డుపైన చూపించింది డాగ్. అంతటితో ఆగకుండా కీ బోర్డును తన కాలితో తన్నేసింది సదరు శునకం. ఈ పదమూడు సెకన్ల వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వావ్.. పెంపుడు కుక్క ఇలా కూడా చేస్తుందా అని అడుగుతున్నారు.
Lan yapacağın işin ben amk. ????????
Benzine 1 pic.twitter.com/2uIHHu80Yc
— güldür güldür (@guldurbakalim) November 24, 2021