Viral Video : శభాష్.. మేకను కాపాడేందుకు అంతటి కష్టమైన పని..
Viral Video : జనరల్ గా సోషల్ మీడియోలో ప్రతీ రోజు బోలెడన్ని కొత్త కొత్త వీడియోలు వైరల్ అవుతుండటం మనం చూడొచ్చు. యూనిక్ వీడియో అయితే చాలు.. కంపల్సరీగా వైరల్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. నెటిజన్లు యూనిక్ వీడియోను వైరల్ చేస్తుంటారు కూడా. కాగా, ఈ వీడియో యూనిక్ వీడియోనే కాదు.. జంతువుల పట్ల మనుషులకు ఉండాల్సిన ప్రేమను గురించి తెలిపే వీడియో అని చెప్పొచ్చు. ఇంతకీ యానిమల్ ను కాపాడేందుకు వీరు ఏం చేశారంటే..
మేకలు కాని ఇతర జంతువుల కాని అవి నడుచుకుంటూ వెళ్లే క్రమంలో ఏదేని సొరంగంలోనో లేదా రంధ్రంలో పడిపోవడం మనం చూడొచ్చు. సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలో ఓ మేక అనుకోకుండా భూమి లోపలి రంధ్రంలో ఇరుక్కుపోయింది. రూపిన్ శర్మ అనే ఐపీఎస్ అధికారి ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన సదరు వీడియోలో మేక భూమిపై భాగంలో తీసిన చిన్న రంధ్రంలో చిక్కుకుపోయింది.
Viral Video : తలకిందులుగా భూమిలోపలికి వెళ్లి మరీ..
అది చూసి స్థానికులు ఓ ఐదుగురు దానిని బయటకు తీయాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తల కిందులుగా రంధ్రంలోకి దూరి పోయి మేకను తన రెండు చేతులతో పట్టుకున్నాడు. పైనున్న నలుగురు మనుషులు సదరు వ్యక్తిని కాళ్లు పట్టుకుని పైకి లాగగా, లోపల ఉన్న మేక బయటకు వచ్చేసంది. మేకను కాపాడేందుకుగాను మనుషులు ఇంతలా రెస్క్యూ చేయడం చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Rescue Operation ????????????????????
Animal Love. pic.twitter.com/TE0lE2ToFv
— Rupin Sharma IPS (@rupin1992) January 21, 2022