Viral Video : పాముతో కోడి పోరాటం.. మరి గెలిచిందెవరంటే..?
Viral Video : తన పిల్లలను జోలికి వస్తే ఎదుటి వారు ఎంతటి వారైనా తల్లి విడిచిపెట్టదు. చివరి వరకు పిల్లల కోసం పోరాడుతూనే ఉంటుంది. అది మనిషి అయినా కావచ్చు. జంతువు అయినా కావచ్చు. ఇలాంటి వీడియోలు మనకు సోషల్ మీడియాలో బాగానే కనిపిస్తుంటారు. ఇలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఓ కోడి ఏకంగా పాముతోనే పోరాటం చేసింది. మరి పాము అంటే భయపడని వారంటూ ఎవరూ ఉండరు. దానిని చూడగానే ముందు అక్కడి నుంచి పారిపోవాలని ట్రై చేస్తాం.
కానీ ఓ కోడి పాముతో యుద్ధం చేసింది. మరి చివరకు ఎవరు గెలిచారు. పాము గెలిచి గుడ్లు తిన్నదా? లేక కోడి గెలిచి గుడ్లను కాపాడుకున్నదా అనే విషయం తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.ఓ కోడి తానుపెట్టిన గుడ్లపై కూర్చుని వాటిని కాపుడుకుంటూ వస్తోంది. ఇంతలో అక్కడికి ఒక పాము వచ్చింది. ఆ గుడ్లను తినే ప్రయత్నం చేసింది. కానీ కోడి ఆ టైంలో భయపడలేదు. పెద్ద సాహసమే చేసింది. తన గుడ్లను ఆ పాము తినకుండా దానితో యుద్ధం చేసింది. పాము కోడిపై ఎన్ని సార్లు బుసకొట్టినా.. దానిని కోడి పట్టించుకోలేదు.

Viral Video hen fight with a snake
Viral Video : పాముపై యుద్ధమే..
పైగా పాముపైకే యుద్ధానికి వెళ్లింది. పామును పొడిచింది. అలా ఈ రెండింటి మధ్య కాసేపు పోరు నడిచింది. ఇక చివరకు పాము అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతుంది. అంతే మరి పిల్లలు జోలికి వస్తే ఏ తల్లి మాత్రం ఊరుకుంటుంది చెప్పండి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ కోడి ధైర్యాన్ని పొగడకుండా ఉండలేక పోతున్నారు. అది చేసిన పోరాటానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కెయ్యండి.
View this post on Instagram