Viral Video : ఈ బుడ్డోడు మాములోడు కాదు.. ముద్దులతో టీచర్‌ను ఎలా కూల్ చేశాడో చూస్తే ఔరా అనాల్సిందే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : ఈ బుడ్డోడు మాములోడు కాదు.. ముద్దులతో టీచర్‌ను ఎలా కూల్ చేశాడో చూస్తే ఔరా అనాల్సిందే!

 Authored By mallesh | The Telugu News | Updated on :16 September 2022,2:00 pm

Viral Video : చిన్నపిల్లలు చేసే పనులు ఒక్కోసారి కోపం తెప్పిస్తాయి. అప్పుడప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంటాయి. వారి చేష్టలకు పెద్దవాళ్లు కోపం తెచ్చుకుంటే కొందరు పిల్లలు చాలా స్మార్ట్‌గా ఆలోచించి కూల్ చేస్తారు. ఆ ట్రిక్ అందరికీ రాదు. కొందరు పిల్లలకు మాత్రమే సాధ్యం.ముఖ్యంగా ఆడపిల్లలు ఏడిస్తే వారు బుంగమూతి పెడుతుంటారు. చాలా త్వరగా ఐస్ చేస్తుంటారు.కానీ ఓ పిల్లాడు తన మేడమ్‌ కోపంగా ఉంటే కూల్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video : ముద్దులతో కూల్ చేశాడుగా..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ స్కూల్ పిల్లాడు తన టీచర్‌ను క్షమాపణలు కోరుతూ కూల్ చేశాడు. నువ్వు ప్రతి సారి ఇలానే చెబుతావు. మళ్లీ తప్పు చేస్తావు అంటూ టీచర్ సీరియస్ అవుతుండగా.. లేదు చేయను మరోసారి అంటూ పిల్లాడు మేడాన్ని తన బుల్లి చేతులతో పట్టుకుని ముద్దులు పెడుతూ కూల్ చేస్తాడు. టీచర్, పిల్లాడు ఇద్దరూ హిందీలో మాట్లాడుకుంటుంటారు. తరగతి గదిలోని పిల్లలు అంతా అల్లరి చేస్తూ వీరినే చూస్తుంటారు. వారికి ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ మేడంను పిల్లాడు ఆమె మెడపై రెండు చేతులు వేసి ఇంకోసారి చేయను అంటూ టీచర్ బుగ్గపై ముద్దులు పెడుతుంటాడు.

Viral Video Student Kss Teacher To Escape From Punishment

Viral Video Student Kss Teacher To Escape From Punishment

మేడం కూడా కోపాన్ని నటిస్తూ పిల్లోడితో కావాలిని ముద్దులు పెట్టించుకుంటుంది. చివరకు తను కూడా తన ప్రియమైన విద్యార్థికి ముద్దు పెట్టి చివరకు క్షమిస్తుంది. ఈ తతంగాన్ని తోటి టీచర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం వైరల్ అవుతోంది.చాలా మంది నెటిజన్లు టీచర్,పిల్లాడి మధ్య జరిగిన క్యూట్ సంభాషణను లైక్స్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. చిన్న పిల్లాడు అందమైన టీచర్‌ను కూల్ చేసిన విధానం చాలా బాగుందని కొందరు అంటున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది