Viral Video : పెళ్లింట తీవ్ర విషాదం.. త‌ల‌పై కుండ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్‌తో మృతి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పెళ్లింట తీవ్ర విషాదం.. త‌ల‌పై కుండ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్‌తో మృతి..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 April 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral Video : పెళ్లింట తీవ్ర విషాదం.. త‌ల‌పై కుండ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్‌తో మృతి..!

Viral Video : ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది గుండెపోటుతో మృతి చెందుతుండడం మ‌నం చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్ల‌ల‌తో పాటు పెద్ద వాళ్లు కూడా గుండెపోటుతో అకాల మ‌ర‌ణం చెందుతున్నారు. సెల‌బ్రిటీలు ఎక్కువ‌గా వ్యాయామం చేసిన కూడా స్ట్రోక్‌కి గుర‌వుతున్నారు. ప‌ని ఒత్తిడి, మాన‌సిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, డీజే సౌండ్స్ వినడం, ఎక్కువగా డ్యాన్స్ చేయడం ఇలా ఎన్నో కారణాల వల్ల హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతున్నారు. అప్ప‌టి వ‌ర‌కు సంతోషంగా ఉన్న వాళ్లు వారి సొంత వాళ్ల ముందే కుప్ప‌కూలి చ‌నిపోతున్నారు. అయితే ఇటీవ‌లి కాలంలో ఎక్కువ‌గా వివాహ వేడుక‌ల‌లో ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి.

Viral Video : క‌ళ్ల ముందే కుప్ప‌కూలి క‌న్నుమూసాడు..

తాజాగా తన మేనళ్లుడి పెళ్లి ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తూ మామ చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మేనల్లుడి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తున్న మేనమామ హఠాన్మరణం చెందడంతో రాజస్థాన్‌లో కలకలం రేగింది. మేనమామ పెళ్లి వేడుకల్లో సంతోషంగా తలపై కుండ పెట్టుకుని జోరుగా డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే ఒక్క‌సారిగా కుప్ప‌కూలాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. మేనకోడలి వివాహం ఏప్రిల్ 19 న జరిగింది. అతని మేనల్లుడు పంకజ్ వివాహం ఏప్రిల్ 21 న జరిగింది. కమలేష్ సొదరుడు ఇంద్రజ్ ధాకా, కుటుంబ సభ్యులతో కలిసి 20న చోటా భాల్ పూరించడానికి లోచ్వాలోని ధానికి వెల్లారు.

Viral Video పెళ్లింట తీవ్ర విషాదం త‌ల‌పై కుండ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్‌తో మృతి

Viral Video : పెళ్లింట తీవ్ర విషాదం.. త‌ల‌పై కుండ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ హార్ట్ ఎటాక్‌తో మృతి..!

ఆ సమయంలో కుండలో బియ్యం నింపాడు. పూజలో తలపై కుండ పెట్టుకొని ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేస్తుండ‌గా,అంద‌రు కూడా విజిల్స్ వేస్తూ అతన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అంతలోనే కమలేష్ కింద పడిపోయారు. ఏం జ‌రిగిందో ఎవ‌రికి అర్ధం కాలేదు. అయితే వెంటనే కమలేష్ ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. అప్పంటి వరకు సంతోషంగా ఉన్న పెళ్లి వాతావరణం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. మృతుడు కమలేష్ సవాల్ ఘర్ లోని చౌకని గ్యాలో ఏజెన్సీలో పనిచేస్తూ ఇంటింటికి గ్యాస్ సిలిండర్స్ పంపిణీ చేసేవాడ‌ని తెలుస్తుంది. క‌మ‌లేష్ ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ.. డ్యాన్స్, పాటలు పాడుతూ సంతోషంగా ఉండేవాడని.. ఇలా హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూయ‌డంతో వారి ఇంట విషాదం నెలకొంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది