Vishnu priya : అబ్బ.. విష్ణు ప్రియ ఏమన్న డాన్స్ చేసిందా.. ఎల్లో కలర్ శారీలో పిచ్చెక్కిస్తుందిగా.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishnu priya : అబ్బ.. విష్ణు ప్రియ ఏమన్న డాన్స్ చేసిందా.. ఎల్లో కలర్ శారీలో పిచ్చెక్కిస్తుందిగా.. వీడియో

 Authored By aruna | The Telugu News | Updated on :30 October 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  అబ్బ.. విష్ణు ప్రియ ఏమన్న డాన్స్ చేసిందా..

  •  ఎల్లో కలర్ శారీలో పిచ్చెక్కిస్తుందిగా.. వీడియో

  •  బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

Vishnu priya  : బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షో కి యాంకరింగ్ చేసి ఫుల్ ఫేమస్ అయింది. బుల్లితెరపై మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఎందుకో తెలియదు కానీ ఈ బ్యూటీకి బుల్లితెరపై యాంకరింగ్ అవకాశాలు రాలేదని చెప్పాలి. కానీ అప్పుడప్పుడు ఈటీవీలో ప్రసారమయ్యే పలు ఈవెంట్స్ లలో కనిపిస్తూ సందడి చేస్తుంటుంది. అలాగే పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల సీరియల్ నటుడు మానస్ తో కలిసి ప్రైవేట్ ఆల్బమ్ చేసింది. ఈ ఆల్బమ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఆల్బమ్ ద్వారా విష్ణుప్రియ కు మంచి క్రేజ్ వచ్చింది.

ఇక విష్ణు ప్రియ అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తుంది. సుడిగాలి సుధీర్ తో కలిసి ‘ వాంటెడ్ పండుగాడ్ ‘ అనే సినిమాలో నటించింది. దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో ఈ బ్యూటీ కి సినిమాలలో అవకాశాలు తగ్గాయి. ఇక ఆమధ్య సీనియర్ నటుడు చక్రవర్తితో ఓ వెబ్ సిరీస్ లో నటించింది. ఇకపోతే విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. హాట్ హాట్ గా ఫోటోలు మాత్రమే కాకుండా వీడియోలు కూడా చేస్తూ సోషల్ మీడియాను హీటెక్కిస్తూ ఉంటుంది.

అయితే తాజాగా విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. సాహో సినిమాలోని ఐటమ్ సాంగ్కు విష్ణు ప్రియ అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఎల్లో కలర్ శారీలో టెంప్ట్ చేసేలా విష్ణు ప్రియ డాన్స్ చేసింది. ఈ వీడియో పై నెటిజెన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అబ్బ విష్ణు ప్రియ ఏమన్నా డాన్స్ చేసిందా అని కొందరు, విష్ణు ప్రియ నా మజాకా అని మరికొందరు సరదాగా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సినిమా అవకాశాల కోసం ఏమో కానీ విష్ణు ప్రియ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది