Viral Video : బరాత్ లో కపుల్స్ డ్యాన్స్ చూస్తే మతి పోవాల్సిందే.. వీడియో వైరల్
Viral Video : ఈ మధ్య కాలంలో వెడ్డింగ్ డ్యాన్స్ కల్చర్ బాగా ట్రెండింగ్ లో ఉంది. ఎక్కడ చూసినా.. ఏ పెళ్లిలో చూసినా.. వధూవరులు డ్యాన్స్ తో అదరగొడుతున్నారు. ఇక పెళ్లి కూతురు అయితే చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి జంకు లేకుండా చుట్టూ ఎంత మంది ఉన్నా డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు పెళ్లి కూతురు సిగ్గుతో తలదించుకుంటుండె. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చారు.. పెళ్లంటే కొత్త ట్రెండ్ సెట్ చేశారు. పెళ్లి కోసం ప్రత్యేకంగా […]
Viral Video : ఈ మధ్య కాలంలో వెడ్డింగ్ డ్యాన్స్ కల్చర్ బాగా ట్రెండింగ్ లో ఉంది. ఎక్కడ చూసినా.. ఏ పెళ్లిలో చూసినా.. వధూవరులు డ్యాన్స్ తో అదరగొడుతున్నారు. ఇక పెళ్లి కూతురు అయితే చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి జంకు లేకుండా చుట్టూ ఎంత మంది ఉన్నా డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు పెళ్లి కూతురు సిగ్గుతో తలదించుకుంటుండె. కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చారు.. పెళ్లంటే కొత్త ట్రెండ్ సెట్ చేశారు. పెళ్లి కోసం ప్రత్యేకంగా వెడ్డింగ్ డ్యాన్స్ కోసం ప్లాన్ చేసుకుని వీడియోలు తీయించుకుంటున్నారు.
ముందుగానే ప్లాన్ చేసుకుని పెళ్లి కూతురు రిసెప్షన్ స్టేజిపై గ్రూప్ గా డ్యాన్స్ చేస్తూ వీడియోలకు, ఫొలటోలకు ఫోజులిస్తోంది. పెళ్లి తంతు మొదలైనప్పటి నుంచి సంగీత్.. మ్యారేజ్.. రిసెప్షన్.. బరాత్ ఇలా ఎక్కడా కూడా వదలకుండా డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అంతే కాకుండా ఫ్రెండ్స్, బంధువులు, ఇంటిల్లిపాది కలిసి డ్యాన్స్ చేస్తూ దుమ్ములేపుతున్నారు. అలాగే డీజే పాటలకు తీన్మార్ స్టెప్పులు వేస్తూ ఊరమాస్ డ్యాన్స్ తో రచ్చ చేస్తున్నారు. వీడియోలు తీయించుకుని నెట్టింట్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం కపుల్స్ బరాత్ లో డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. చూట్టూ జనం చేరి ఈలలు వేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక నూతన వధూవరులు మాస్ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. పెళ్లి కూతురు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ సత్యభామ.. తెలుగు సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేసింది. సూపర్ డ్యాన్స్ బాగా చేశారు.. అంటూ నెటిజన్లు కామెంట్స్ తో ప్రశంసిస్తున్నారు.