Adilabad..దేశ అభివృద్ధిలో యూత్ పాత్ర కీలకం
దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని జిల్లాలోని కౌటల మండానికి చెందిన నాయకులు సూరన్న అన్నారు. యువత ప్రశ్నించాలని, పాలకులను నిలదీయాలని సూచించారు. అలా చేసినప్పుడే సొసైటీలో మార్పు సాధ్యమని అన్నారు. ఈ నేపథ్యంలోనే సూరన్న ‘పల్లె పల్లెకు సూరన్న’ అనే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గురువారం కౌటల మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందుతేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ క్రమంలో యువతీ యువకులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరు హేతుబద్ధంగా ఆలోచించాలని చెప్పారు.
ఇకపోతే గ్రామాల్లో యువకులు యాక్టివ్‌గా ఉండి అభివృద్ధి విషయమై ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రశ్నించినప్పుడే సమాజంలో మార్పు సాధ్యమని, యువతీ యువకులకు రాజకీయ వ్యవస్థను ప్రశ్నించే సత్తా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. యువతను చైతన్య పరిచేందుకుగాను తాను ఈ పల్లె పల్లెకు సూరన్న అనే ప్రోగ్రామ్‌ను చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువతీ యువకులకు ప్రశ్నించేతత్వం గురించి తెలిపే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.