Uttam Kumar Reddy : కేసీఆర్, వైయస్ జగన్ దోస్తీ.. నిజ‌స్వ‌రూపం అస్లెంబ్లీ సాక్షిగా బ‌య‌ట పెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Uttam Kumar Reddy : కేసీఆర్, వైయస్ జగన్ దోస్తీ.. నిజ‌స్వ‌రూపం అస్లెంబ్లీ సాక్షిగా బ‌య‌ట పెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

 Authored By aruna | The Telugu News | Updated on :13 February 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Uttam Kumar Reddy : కేసీఆర్, వైయస్ జగన్ దోస్తీ.. నిజ‌స్వ‌రూపం అస్లెంబ్లీ సాక్షిగా బ‌య‌ట పెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

Uttam Kumar Reddy : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏపీలో ఆయకట్టులో లేని ప్రాజెక్టులు నిర్మాణానికి కేసీఆర్ సహకారం ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేఆర్ఎంబికి సాగునీటి ప్రాజెక్టులను అప్పగించేదీ లేదని తీర్మానించారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని తెలంగాణ అసెంబ్లీలో ప్రదర్శించారు. తెలంగాణ నుంచి నీరు వదిలితే తప్ప ఏపీకి నీరు వచ్చే పరిస్థితి లేదని, రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, గుంటూరు, కృష్ణ , నెల్లూరు, పశ్చిమగోదావరి కి నీరు వచ్చే అవకాశం లేదని, కేసిఆర్ ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీరు తీసుకోవడానికి ఒప్పుకున్నారని వైఎస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు.

కేసీఆర్, వైయస్ జగన్ మధ్య ఉన్న సంబంధాల వల్లే తెలంగాణ రాష్ట్రం నష్టపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వెళ్లాలన్నారు. ఎన్నికల్లో నవంబర్ 30న పోలింగ్ జరగటానికి ముందు ఒకరోజు రాత్రి ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్ కుడిగట్టు గేట్లను బలవంతంగా స్వాధీనం చేసుకుందన్నారు. ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడానికి ఆ సమయంలో వైయస్ జగన్ అలా చేశారని అనుమానం అందరికీ ఉందన్నారు. 400 , 500 మంది బలగాలతో 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారన్నారు. ఆ సమయంలో కేసీఆర్ వైయస్ జగన్ కు మంచి సంబంధాలు ఉన్నాయని, కేసీఆర్ ఓడిపోతున్నారని తెలిసి వైయస్ జగన్ ఆంధ్ర పోలీసుల్ని సాగర్ మీదకు పంపారని అనుమానాలు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు.

సాగర్ గేట్లను స్వాధీనం చేసుకునే విషయంలో ఈరోజుకు కేసీఆర్ ఈ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. డిసెంబర్ 1న కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తెలంగాణ ఫలితాలు రాకముందే సిఆర్పిఎఫ్ ను పంపి ఏపీ పోలీసులను అక్కడి నుంచి పంపారన్నారు. ఆ సమయంలో కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలో లేరన్నారు. నాటికి తెలంగాణలో కేసీఆర్ సీఎం గానే ఉన్నారని అప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేనాటికి తెలంగాణ సీఎంగా కేసీఆర్, ఆయన కార్యదర్శిగా స్మిత సబర్వాల్ సెక్రటరీ హోదాతో పాటు ఇరిగేషన్ అదనపు బాధ్యతలు చూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ తరపున సెక్రటరీ స్మిత సబర్వాల్ డిసెంబర్ 1న రాసిన లేఖలో కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించడానికి వేరే రాష్ట్రాలు అంగీకరించాలని గుర్తు చేశారు. 15 జులై 2021 పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేఆర్ఎంబికి ప్రాజెక్టులను అప్పగించాలని స్మిత సబర్వాల్ గుర్తు చేశారన్నారు. ప్రాజెక్టులను కేఆర్ ఎంబికి అప్పగించారన్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది