ABN Radha Krishna : BREAKING ABN రాధాకృష్ణ కి ప్రాణ హాని ఉందా..?
ప్రధానాంశాలు:
ABN Radha Krishna : BREAKING ABN రాధాకృష్ణ కి ప్రాణ హాని ఉందా..?
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమా అని నాయకుల నోటి దూల కూడా బాగా పెరిగిపోయింది. రీసెంట్ గా వైసీపీ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే ఏబీఎన్ పేపర్ ని ఆర్కేని లేకుండా చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు ఈ కొత్త పలుకు కాదు కదా రాధాకృష్ణ అసలు పలుకు పలకకుండా చేస్తామంటూ బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశాడు. ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఒక మీడియా సంస్థను లేదా ఒక వ్యక్తిని అంతం చేస్తామనడం ఎంతవరకు సమంజసమో ఆ నాయకుడికే తెలియాలి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాగే మాట్లాడాడు. తాను అధికారంలోకి రాగానే ఆర్కే తడాకా చూపిస్తానని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిస్తానని అన్నాడు. అప్పట్లో అధినాయకుడే అలా అంటే ఇప్పుడు కింద ఉన్న వాళ్ళు అంతకంటే ఎక్కువే మాట్లాడుతున్నారు.

ABN Radha Krishna : BREAKING ABN రాధాకృష్ణ కి ప్రాణ హాని ఉందా..?
ABN Radha Krishna : BREAKING : ABN రాధాకృష్ణ కి ప్రాణ హాని ?
నిజానికి గతంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద కేసులు వచ్చినప్పుడు ఆయన హైదరాబాద్ పారిపోయి అక్కడి నుంచి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్న సంగతి అందరికీ గుర్తే. ఒక నెల రోజుల పాటు దొరక్కుండా తిరుగుతూ చివరికి కర్ణాటకలో ఎక్కడో ఒక ఫామ్ హౌస్ లో దొరికాడు. అప్పట్లో మీసాలు మేలేసి సవాళ్లు విసిరిన ఆయన పోలీసులు రాగానే పిల్లిలా మారిపోయాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి మీడియా మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. పైగా ఏబీఎన్ ని బ్యాన్ చేయడానికి జగన్ మొదటి సంతకం పెడతారట. అలా అయితే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు కూడా సాక్షిని బ్యాన్ చేయవచ్చు కదా. సాక్షి పరిస్థితి ఎలా ఉందంటే ప్రస్తుతం కోర్టు ఆర్డర్ల మీద నడుస్తోంది. మొన్నటికి మొన్న తెలంగాణ హైకోర్టు కూడా సాక్షికి మొట్టికాయలు వేసి పంపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మీడియా సంస్థను మూయించడం అనేది అంత సులభమైన విషయం కాదు. ప్రస్తుతం హైకోర్టు కూడా సోషల్ మీడియాలో వస్తున్న విద్వంసకర పోస్టుల మీద చాలా సీరియస్ గా ఉంది. వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వారి రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారేలా ఉన్నాయి.
అమరావతిలో ఉండకుండా ఎక్కడో బెంగళూరు ప్యాలెస్ లో ఉంటూ రాజకీయాలు చేసే జగన్ కు ఇలాంటి మాటలు పార్టీని మరింత దిగజార్చేలా చేస్తాయి. మీడియాను భయపెట్టాలని చూస్తే అది రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అంబటి రాంబాబు జోగి రమేష్ వంటి వారి మీద కేసులు నమోదయ్యాయి. మీడియా సంస్థల జోలికి వెళ్లడం అంటే అది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని గుర్తుంచుకోవాలి. రాజకీయాల్లో విమర్శలు ఉండాలి కానీ ఇలా ప్రాణాలు తీస్తామని హెచ్చరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆర్కే లాంటి వ్యక్తులకు కేంద్ర స్థాయిలో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. గతంలో అమిత్ షా స్వయంగా రామోజీరావును రాధాకృష్ణను కలిసిన విషయాన్ని మర్చిపోకూడదు. అనవసరంగా మీడియాపై దాడులకు దిగితే చివరికి నాయకులే జైలుకు వెళ్లాల్సి వస్తుంది.