Jogi Ramesh : జోగి రమేష్ అలా మాట్లాడ్డం వెనక చాలా పెద్ద స్ట్రాటజీ ఉందా ?
Jogi Ramesh : సోమవారం రాజధాని ప్రాంతం అమరావతిలో ఆర్ 5 జోన్ ఇళ్ళకి శంకుస్థాపన కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం నేపథ్యంలో ఇళ్ల పట్టా లబ్ధిదారులను ఉద్దేశించి బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభలో వైసీపీ మంత్రి జోగి రమేష్… ప్రతిపక్ష నాయకుల పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నీ ఉద్దేశించి పిచ్చికుక్క అంటూ విమర్శించారు. ఢిల్లీలో విగ్గు రాజుతో కలిసి కంపెనీ పెట్టు.. ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలో కంపెనీ పెట్టు అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పేదలకు అన్నం పెడుతున్నాడు.. గూడు కల్పిస్తున్నాడు.. వైయస్ జగన్ ను ఎవరూ టచ్ కూడా చేయలేరన్నారు.
పవన్ కల్యాణ్ పెళ్లాలనే కాదు పార్టీలను కూడా మారుస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. జగన్ ను ఎవరూ టచ్ చేయలేరు. ఆయనను టచ్ చేయాలంటే ముందు మమ్మల్ని దాటుకుని వెళ్ళాలి అని జోగి రమేష్ పెద్దపెద్ద డైలాగులు వేశారు. పెత్తందారుల పక్కన పేదలు ఉండకూడదని ఈ కార్యక్రమాన్ని న్యాయస్థానానికి వెళ్లి చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయితే సీఎం జగన్ న్యాయపరమైన చిక్కులను అధిగమించి పేదలకు ఇల్లు వచ్చేలా చేసినట్లు స్పష్టం చేశారు. పేదల సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్ కి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. లోకేశ్ పాదయాత్రను ప్రస్తావిస్తూ జగన్ తో పోటీనా అని ఫైర్ అయ్యారు. జగన్ ఒక ధీరుడని..ఢిల్లీ కోటనే బద్దలు కొట్టారని చెప్పుకొచ్చారు.
ఒకానొక దశలో మరి రఫ్ గా జోగి రమేష్ మాట్లాడే క్రమంలో సీఎం జగన్ ఆపే ప్రయత్నం చేసిన తన ప్రసంగాన్ని ఆపకుండా ముందుకు కొనసాగించారు. అయితే ఇంతగా మంత్రి జోగీ రమేష్ వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం.. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ కోసమే అన్నట్టు ప్రచారం జరుగుతుంది. పార్టీ టికెట్ తో పాటు మంత్రి పదవి ప్రారంభంలోనే అందుకునే విధంగా జగన్ నీ మెప్పించడానికి మంత్రి జోగి రమేష్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.