YS Jagan Mohan Reddy : ఆళ్ళ రామకృష్ణారెడ్డికి జగన్ పెట్టిన షరతు ఏంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan Mohan Reddy : ఆళ్ళ రామకృష్ణారెడ్డికి జగన్ పెట్టిన షరతు ఏంటి..?

 Authored By aruna | The Telugu News | Updated on :21 February 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan Mohan Reddy : ఆళ్ళ రామకృష్ణారెడ్డికి జగన్ పెట్టిన షరతు ఏంటి..?

YS Jagan Mohan Reddy  : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జాతీయ రాజకీయాల కంటే కూడా చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు నేతలు పార్టీలు కూడా మారుతూ వస్తున్నారు. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి యొక్క వై.యస్.ఆర్.సీ.పీ. పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి మళ్లీ వెంటనే తిరిగి వై.సీ.పీ. పార్టీలోకి ఆళ్ళ రామకృష్ణ రావడం జరిగింది. అయితే ఆళ్ల రామకృష్ణ ఈ విధంగా చేయడం వెనక బలమైన వ్యూహం ఏదో ఉందంటూ పలువురు పలు రకాలుగా ఆరోపిస్తున్నారు. అలాగే ఆళ్ల రామకృష్ణ తిరిగి వై.సీ.పీ కి వస్తా అనగానే వై.యస్ జగన్మోహన్ రెడ్డి కూడా వెంటనే అంగీకరించటం చూస్తుంటే దీని వెనక ఏదో వ్యూహం ఉందని టీడీపీ ఆరోపణలు చేస్తుంది. అయితే ఈ విషయంపై టీడీపీ తో పాటు కాంగ్రెస్ పార్టీ అలాగే వైసిపి యాంగిల్ ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే ఆళ్ల రామకృష్ణ యొక్క రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్ పార్టీలోనే. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని విభేదించి వై.యస్ జగన్ బయటకు వచ్చి తన సొంత పార్టీని పెట్టుకున్నాడో.. అలాంటి తరుణంలో వైయస్ జగన్ కు అండగా నిలబడిన వారిలో ఆళ్ల రామకృష్ణ కూడా ఒకరు. వై.ఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అలాంటి రామకృష్ణారెడ్డిని నిర్ధాక్షణ్యంగా టికెట్ ఇవ్వకుండా ఇంచార్జ్ మార్పు పేరుతో సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా పక్కన పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు చెప్పకనే చెప్పిన ఒక విషయం. అదేమని అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి నాయకుడిని సర్వే సరిగా లేకపోతే తీసివేయడం జరిగింది. రేపు రాబోయేటువంటి జాబితాలో మీ పేరు కూడా ఉంటుందో లేదో చెప్పడం కష్టమే అన్నట్లు ముందే తెలియజేశారు. అందుకే మొదటి జాబితాలోనే ఆళ్ళ రామకృష్ణ పేరు వచ్చింది. అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎందుకు బయటకు వెళ్లిపోయారు అంటే లోకల్ గా అభివృద్ధి జరగలేదు. లోకల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వలేదు. అలాగే వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఫండ్స్ ఇవ్వలేదు. అందుకే తాను అప్పు చేయాల్సి వస్తుందని అందుకే బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పడం జరిగింది. అయితే ఇలా వెళ్ళిపోయిన తర్వాత షర్మిల తో జరిగినటువంటి పరిణామాలు లేక ఏదైనా వ్యూహంతో వెళ్లారా అనేది మనకు తెలియదు కానీ మళ్ళీ తిరిగి వై.సీ.పీ పార్టీలోకి వచ్చారు. అయితే ఇక్కడ టీడీపీ ఏం చెబుతుందంటే నారా లోకేష్ ని ఓడించడం కోసమే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆళ్ల రామకృష్ణుని తీసుకువచ్చినట్లుగా చెబుతున్నారు.

ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో రెబల్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేస్తే కచ్చితంగా వైసీపీ పార్టీ తరఫున నిలబడిన వ్యక్తికి నష్టం జరుగుతుంది.ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పై పడేటువంటి ఓట్లు అన్నీ కూడా వైసీపీ పార్టీ ఓట్లను చీలిక చేసి పడుతుంది. తద్వారా మంగళగిరిలో గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి లోకేష్ ఖచ్చితంగా ఈసారి గెలుస్తారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెడతారు. ఇక ఇది జగన్మోహన్ రెడ్డికి అసలు ఇష్టం లేదు. అయితే ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ లో తాను గెలిచి సీఎం అయినా కాకపోయినా అసెంబ్లీలో మాత్రం నారా లోకేష్ ఉండకూడదని, పవన్ కళ్యాణ్ కూడా ఉండకూడదని జగన్ మోహన్ రెడ్డి గట్టి టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో ఆళ్ల రామకృష్ణ వంటి నాయకుడు కాంగ్రెస్ వైపు నిలబడితే వై.సీ.పీ కు కచ్చితంగా ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పాలి. ఇక్కడ లోకేష్ గెలిచి తీరే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే ఒక స్ట్రాటజీ అమలుపరుస్తూ ఆళ్ల రామకృష్ణని మళ్లీ వెనక్కి తీసుకొచ్చింది వై.సీ.పీ. అధిష్టానం.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది