Ambati Rambabu : లోకేష్ కు ముందుంది ముసళ్ళ పండుగ : అంబటి
ప్రధానాంశాలు:
Ambati Rambabu : లోకేష్ కు ముందుంది ముసళ్ళ పండుగ : అంబటి
Ambati Rambabu : వైసీపీ నేత అంబటి రాంబాబు తాజాగా చంద్రబాబు నాయుడు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అసలు ఎన్టీఆర్ మరణంతోనే చనిపోయిందని, ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు వెన్నుపోటు ద్వారా పుట్టిందని ఆరోపించారు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడూ ఇతర పార్టీల అండదండలతోనే నడిచిందని, ఒక్కసారి కూడా ఒంటరిగా ఎన్నికల బరిలో దిగలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పూర్తిగా అధికారం కోసం మారే రాజకీయ నాయకుడిగా రాంబాబు అభివర్ణించారు.

Ambati Rambabu : లోకేష్ కు ముందుంది ముసళ్ళ పండుగ : అంబటి
Ambati Rambabu చంద్రబాబు వెన్ను పోటు నుంచి పుట్టిన పార్టీ టీడీపీ – అంబటి
అధికారం కోసం బీజేపీ, కమ్యూనిస్టులు, జనసేన లాంటి పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం చంద్రబాబు రాజకీయ ప్రవర్తన అని విమర్శించారు. అవసరానికి అనుగుణంగా మిత్రపక్షాలను వదిలివేయడంలో చంద్రబాబు నిపుణుడు అంటూ ధ్వజమెత్తారు. అంతేకాకుండా లోకేష్ తన తండ్రి వారసత్వాన్ని స్వీకరించుకున్నారని, అధికార మదంతో జనాలను వేధిస్తున్నారని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా చంద్రబాబు తీరును తీవ్రంగా విమర్శించారు. పోలవరాన్ని పూర్తిగా దోచుకున్న వ్యక్తిగా ఆయనను పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేసిన తరువాతే కేంద్రం నిధులు వెనక్కి చెల్లించేది కానీ, చంద్రబాబు ఈ వ్యవహారాన్ని ప్రజలను మోసం చేసేలా చిత్రీకరించారని ఆరోపించారు. పోలవరం నిధులు దారి మళ్లించారని నిరూపిస్తే తాను చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తానని అంబటి ప్రకటించారు. మొత్తానికి చంద్రబాబు పాలనపై, ఆయన పాలనా తీరు, రాజకీయ వ్యూహాలపై అంబటి రాంబాబు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.