Ys Jagan : వైఎస్ జగన్ కు షాక్ ఇచ్చిన మరో కీలక నేత
ప్రధానాంశాలు:
Ys Jagan : వైఎస్ జగన్ కు షాక్ ఇచ్చిన మరో కీలక నేత
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు బయటకు వెళ్లిపోతుండటంతో పార్టీ శిబిరంలో అసంతృప్తి నెలకొంది. తాజాగా విశాఖపట్నం నుంచి సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన చొక్కాకుల వెంకటరావు పార్టీకి గుడ్ బై చెప్పడం జగన్‌కు మరో ఊహించని దెబ్బగా మారింది. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు పంపినట్టు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.

Ys Jagan : వైఎస్ జగన్ కు షాక్ ఇచ్చిన మరో కీలక నేత
Ys Jagan జగన్ కు మరో దెబ్బ
చొక్కాకుల వెంకటరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపితమైన కాలంలోనే పార్టీలో చేరి విశాఖలో కీలక నాయకుడిగా ఎదిగారు. 2013లో విశాఖ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, అనంతరం విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్తగా, 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లిన వెంకటరావు, కొంతకాలం తర్వాత తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన భార్య లక్ష్మికి కీలక పదవిలో అవకాశం లభించగా, తర్వాత ఆయనకూ అదే సంస్థలో చైర్మన్ బాధ్యతలు లభించాయి.
ఇటీవల కాలంలో రాజకీయంగా చురుకుగా కనిపించని వెంకటరావు, పార్టీలో జరిగిన పరిణామాలతో అసంతృప్తికి లోనయ్యారని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి ఎదుర్కొన్న నేపథ్యంలో, పలు పార్టీల్లో కలవాలన్న దిశగా నేతలు ఆలోచనలు చేస్తుండటం కనిపిస్తోంది. చొక్కాకుల వెంకటరావు మళ్లీ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా, లేక కూటమిలోని మరో పార్టీలో చేరతారా అన్నది త్వరలో స్పష్టత వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైనా విశాఖలో ఆయన పార్టీ వీడటం వైసీపీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి.