Farmers : రైతుల అకౌంట్ల‌లోకి ఏపీ ప్ర‌భుత్వం న‌గ‌దు జ‌మ‌.. కానీ వీరికి మాత్ర‌మే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Farmers : రైతుల అకౌంట్ల‌లోకి ఏపీ ప్ర‌భుత్వం న‌గ‌దు జ‌మ‌.. కానీ వీరికి మాత్ర‌మే

 Authored By prabhas | The Telugu News | Updated on :10 April 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Farmers : రైతుల అకౌంట్ల‌లోకి ఏపీ ప్ర‌భుత్వం న‌గ‌దు జ‌మ‌.. కానీ వీరికి మాత్ర‌మే

Farmers  : ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం కొబ్బరి అభివృద్ధి బోర్డు (CDB), ఇతర విభాగాల ద్వారా కొబ్బరి రైతులకు ఆర్థిక సహాయం, ప‌థ‌కాల‌ను అందిస్తుంది. వీటిలో కొత్త కొబ్బరి మొలకలను నాటడానికి, సమగ్ర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి సబ్సిడీలు ఉన్నాయి. అలాగే చ‌నిపోయిన కొబ్బ‌రి చెట్లు, కాయ‌లు కాయ‌ని చెట్ల‌కు ప్ర‌భుత్వం న‌గదు అందజేస్తుంది.

Coconut Farmers రైతుల అకౌంట్ల‌లోకి ఏపీ ప్ర‌భుత్వం న‌గ‌దు జ‌మ‌ కానీ వీరికి మాత్ర‌మే

Coconut Farmers : రైతుల అకౌంట్ల‌లోకి ఏపీ ప్ర‌భుత్వం న‌గ‌దు జ‌మ‌.. కానీ వీరికి మాత్ర‌మే

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొబ్బ‌రి రైతుల కోసం కొబ్బరి తోటల పునరుద్ధరణ స్కీమ్ అమలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది కేవలం కొబ్బరి తోటలు ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన రైతులకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్ప‌వ‌చ్చు.

చనిపోయిన కొబ్బరి చెట్లు, కాయలు కాయని కొబ్బరి చెట్ల‌ను ఉద్యాన వన శాఖ అధికారులు గతేడాది మే, జూన్ నెలల్లో ఇలాంటి చెట్లను గుర్తించి, రైతుల పేర్లను నమోదు చేశారు. ఇప్పుడు వీళ్లకు ఆ చెట్లకు సంబంధించి డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. ప్రభుత్వం 850 హెక్టార్లలో 23 వేలకు పైగా కొబ్బరి చెట్లకు డబ్బులు విడుదల చేసింది. ఒక్కో చెట్టుకు రూ.1000 అందించింది. దాదాపు 1,330 మందికి పైగా రైతులకు రూ.2.3 కోట్లకు పైగా న‌గ‌దు విడుద‌ల చేసింది.

కోనసీమ జిల్లా ఉద్యాన శాఖ అధికారి రమణ తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. కొబ్బ‌రి రైతులంద‌రూ ప్ర‌భుత్వ ప‌థ‌కాన్ని వినియోగించుకోవాల‌న్నారు. హెక్టారుకు 32 చెట్ల వ‌ర‌కు పరిహారం అందిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వం ఈ స్కీమ్‌ను ప్రతి ఐదేళ్లకు ఒకసారి అమలు చేస్తూ వస్తుంది. ఒకసారి ఈ ప‌థకం కింద ప్రయోజనం పొందిన రైతులు మ‌రుస‌టి ఏడాది ఈ ప్ర‌యోజ‌నం పొందలేరు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది