AP : ఏపీ ప్ర‌జ‌ల‌కి గుడ్ న్యూస్.. వాటి ధ‌ర‌లు ఒక్క‌సారిగా త‌గ్గింపు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP : ఏపీ ప్ర‌జ‌ల‌కి గుడ్ న్యూస్.. వాటి ధ‌ర‌లు ఒక్క‌సారిగా త‌గ్గింపు..?

 Authored By ramu | The Telugu News | Updated on :17 February 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  AP : ఏపీ ప్ర‌జ‌ల‌కి గుడ్ న్యూస్.. వాటి ధ‌ర‌లు ఒక్క‌సారిగా త‌గ్గింపు..?

AP : ఈ మ‌ధ్య సామాన్యులు చాలా ఇబ్బందులు ప‌డుతున్నారు. నిత్యావసరాలు విష‌యంలో వారి బాధ వ‌ర్ణ‌నాతీతం. ప్రతి ఒక్కరూ కూడా బియ్యం నుంచి కూరలు వరకు అన్నిటినీ ప్రతిరోజు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే సామాన్యుల ప‌రిస్థితిని అర్ధం చేసుకున్న AP Govt ఏపీ ప్ర‌భుత్వం పచ్చి మిర్చి, ఎండు మిర్చి, వంకాయ, టమాటా సహా పలు కూరగాయల ధరలను స్థిరంగా ఉంచేందుకు కృషి చేస్తోంది.

AP ఏపీ ప్ర‌జ‌ల‌కి గుడ్ న్యూస్ వాటి ధ‌ర‌లు ఒక్క‌సారిగా త‌గ్గింపు

AP : ఏపీ ప్ర‌జ‌ల‌కి గుడ్ న్యూస్.. వాటి ధ‌ర‌లు ఒక్క‌సారిగా త‌గ్గింపు..?

AP మీకు శుభ‌వార్త‌..

కూరగాయల ధరల నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ స్ప‌ష్టం చేశారు. టమాటా, వంకాయ, పచ్చి మిర్చి, ఎండు మిర్చి వంటి కూరగాయల ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. రైతులకు మద్దతు ధర అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఎప్పటికప్పుడు నిత్యావసరాల ధరలను తగ్గించే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉంది. తద్వారా సామాన్యుల పై కాస్త ఖర్చు తగ్గి భారం దింపుతుంది. తాజాగా కిలో 150 రూపాయలు ఉన్న కందిపప్పును కేజీ రూ.120కు.. అంటే 30 రూపాయలు తగ్గించి రైతు బజార్‌లో విక్రయిస్తున్నారు. రైతులు తగిన మద్దతు ధర లేక ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది