AP Kapu Community : ఏపీ కూటమి పాలనలో కూడా కాపులకు పడిగాపులు తప్పవా..?
AP Kapu Community : ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువ అన్నది అందరు చెప్పుకునే మాటే. ఐతే మెజారిటీ పీపుల్ ఎక్కువ ఎవరికి ఓటు వేస్తే వాళ్లే ఎలాంటి పదవినైనా దక్కించుకుంటారు. ఏపీలో కమ్మ, రెడ్డి తర్వాత కాపు కమ్యునిటీ గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. బీసీలు రాజకీయాల్లో బలం పెంచుకోవాలని అనుకుంటారు. చంద్రబాబు ఆ విషయం ముందే గుర్తించి తన పార్టీలో బీసీలకు సమాన ప్రాధాన్యత ఇస్తాడు. ఐతే వైఎస్ జగన్ మాత్రం కాపులకు సరైన న్యాయం చేయలేదు.ఏపీ లో బాబు సీఎం గా ఉన్నప్పుడే కాపు రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నారు. కానీ ఇంతవరకు అది జరగలేదు. వైఎస్ జగన్ వచ్చాక కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేశారు. కానీ దానికి ఎలాంటి నిధులు ఇవ్వలేదు.
AP Kapu Community విదేశీ విద్యకు అందని ప్రభుత్వ సాయం
అందుకే దాదాపు ఏపీలో కాపులంతా ముద్రగడని వదిలి పవన్ కళ్యాణ్ వైపు వచ్చారు. 2014 లో కాపు రిజర్వేషన్ ఇవ్వని బాబు మీద ఫైట్ చేసి ఉద్యమాన్ని నడిపించిన ముద్రగడ పద్మనాభం వైఎస్ జగన్ పక్షాన చేరి కాపు కార్పొరేషన్ ను మాత్రం ముందుకు నడిపించలేకపోయారు.కాపు రిజర్వేషన్లు మత్రమే కాదు విదేశీ విద్యా దీవెన కింద రావాల్సిన ప్రభుత్వ సాయాన్ని కూడా రాకుండా చేశారు. ఇదంతా పగ పట్టిన కాపు నేతలు కూటమికి ఓటేసి గెలిపించారు.
ఐతే ఏపీలో కూటమి వచ్చింది. బాబు సీఎం గా ఏపీని ఎలా అభివృద్ధి బాటలో నడిపించాలో ప్రణాళిక చేస్తున్నారు. ఐతే తమ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు ఏంటని కాపు సంఘాలు చర్చించుకుంటున్నాయి. ఈమధ్యనే వారంతా కలిసి మంత్రి కందుల దుర్గేష్ ని కలవగా పవన్ కళ్యాణ్ కు కూడా ఈ విషయాన్ని వివరించాలని అన్నారు. జగన్ రద్దు చేసిన కాపు రిజర్వేషన్లు, కాపు కార్పొరేషన్ ని మళ్లీ పునరుద్దరించాల్సి ఉంది. మరి ఈ విషయంపై ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న సీఎం చంద్రబాబు కాపులకు ఎప్పుడు అభయం ఇస్తాడన్నది ఎదురుచూస్తున్నారు.