AP Ration Cards : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే రేషన్ కార్డులకు దరఖాస్తులు
ప్రధానాంశాలు:
AP Ration Cards : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే రేషన్ కార్డులకు దరఖాస్తులు
AP Ration Cards : సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆంధ్ర్ర్రప్రదేశ్ ప్రజల ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు నూతన రేషన్ కార్డులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త రేషన్ కార్డుల కార్యాచరణను ప్రారంభించింది. దీంతో అర్హులు నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
AP Ration Cards : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే రేషన్ కార్డులకు దరఖాస్తులు
మే 7వ తేదీ నుండి కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నెల రోజుల పాటు దరఖాస్తుకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇప్పటికే రేషన్‌కార్డుల్లో మార్పుల కోసం 3.28 లక్షల దరఖాస్తులు అందాయి. కొత్త రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. జూన్‌లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈకేవైసీ పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 12వ తేదీ నుంచి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గతంలో ఉన్నట్టు కాకుండా కొత్త విధానంలో ఏపీ రేషన్ కార్డులు రానున్నాయి. చిన్నగా స్మార్ట్ కార్డు అందిస్తున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.