Venu Swamy : ఇకపై రాజ‌కీయాలు, క్రికెట్ గురించి జాతకాలు చెప్పబోను… కారణం అదే… వేణు స్వామి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venu Swamy : ఇకపై రాజ‌కీయాలు, క్రికెట్ గురించి జాతకాలు చెప్పబోను… కారణం అదే… వేణు స్వామి…!

 Authored By ramu | The Telugu News | Updated on :2 June 2024,11:30 am

ప్రధానాంశాలు:

  •  Venu Swamy : ఇకపై రాజ‌కీయాలు, క్రికెట్ గురించి జాతకాలు చెప్పబోను... కారణం అదే... వేణు స్వామి...!

Venu Swamy : భారతదేశంలో ఇటీవల ఐపిఎల్ సీజన్ ఎంతో ఘనంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు కోల్కత్తా నైట్ రైడర్స్ ఫైనల్ వరకు చేరుకున్నాయి. చెన్నై వేదికగా జరిగిన ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ పై కోల్కత్తా నైట్ రైడర్స్ ఘనవిజయం సాధించింది. అయితే ఎప్పుడూ కూడా సెలబ్రిటీల జాతకాలు రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ గా మారే వేణు స్వామి ఈసారి ఓ ఇంటర్వ్యూలో భాగంగా క్రికెట్ గురించి మాట్లాడుతూ ఈసారి ఐపీఎల్ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని తెలియజేశారు.

ఈ ఏడది సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య జాతకం చాలా బాగుందని అందుకే ఈసారి హైదరాబాద్ టీమ్ మంచి ఫామ్ లో కనిపిస్తుందని ఇక వారిని ఎవరు ఆపలేరని కచ్చితంగా కప్ కొడతారంటూ వేణు స్వామి తెలియజేశారు. కానీ ఫైనల్ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ కోల్కత్తా నైట్ రైడర్స్ పై దారుణంగా ఓటమి పాలు కావడంతో సోషల్ మీడియాలో వేణు స్వామి పై విపరీతంగా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాక వేణు స్వామి చెప్పే మాటలు అబద్దాలని అతను చెప్పేవి జరగవు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేశారు. ఇక ఈ ట్రోలింగ్ పై వేణు స్వామి కూడా స్పందిస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మంచి ఫామ్ లో కనిపిస్తుందని అలాగే కావ్య జాతకం ప్రకారం గెలిచే అవకాశం ఉందని చెప్పాను కానీ కచ్చితంగా గెలుస్తుందని నేను ఎక్కడా చెప్పలేదని వేణు స్వామి స్పష్టం చేశారు.

Venu Swamy ఇకపై రాజ‌కీయాలు క్రికెట్ గురించి జాతకాలు చెప్పబోను కారణం అదే వేణు స్వామి

Venu Swamy : ఇకపై రాజ‌కీయాలు, క్రికెట్ గురించి జాతకాలు చెప్పబోను… కారణం అదే… వేణు స్వామి…!

ఒక జ్యోతిష్యుడుగా ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే నేను నా వృత్తి రీత్యా జాతకాలను చెబుతూ జ్యోతిష్యాన్ని పెంపొందిస్తూ వెళ్తానని ఎవరు ఎన్ని రకాలుగా ట్రోలింగ్ చేసిన జరిగేవి జరుగుతూనే ఉంటాయంటూ వేణు స్వామి తెలిపారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ ఇకపై క్రికెట్ గురించి జాతకాలు చెప్పబోనని తెలిపారు. క్రికెట్ గురించి బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా నేను ఎలాంటి జ్యోతిష్యాలు చెప్పనని ఎవరైనా పర్సనల్ గా వచ్చి అడిగితే చెబుతానంటూ వేణు స్వామి స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది