Bhuvaneshwari : ఎన్నికలు అయ్యేంతవరకు ఏపీలోనే భువనేశ్వరి, బ్రాహ్మణి..!!
Bhuvaneshwari : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని సీఐడీ అరెస్టు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో శనివారం సిట్ కార్యాలయంలో దాదాపు 8 గంటలకు పైగా చంద్రబాబుని విచారించి తర్వాత ఆదివారం ఉదయం సీఐడీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. చంద్రబాబు తరఫున లుద్రా అనే ప్రముఖ లాయర్ వాదనలు వినిపించారు. మధ్యాహ్నం మూడు గంటల దాకా వాదనలు సాగాయి. చంద్రబాబు పరిస్థితి ఇలా ఉంటే ప్రజలలోకి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సానుభూతి తరహాలో ప్రజలలోకి వెళ్లి చంద్రబాబుపై వైసీపీ వ్యవహరిస్తున్న తీరును వివరిస్తూ న్యాయం కోరే రీతులో అత్తా కోడలు.. రెడీ అయ్యారట. యంసంపై తెలుగుదేశం పార్టీ పెద్దలలో ఇప్పటికీ ఒక కార్యాచరణ సిద్ధమైందని సమాచారం. సీఐడీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు కూడా.. ప్రజలలోకి తీసుకెళ్లాలని ప్రతిపక్ష నేతలపై వైసీపీ రాజకీయ కక్షత వ్యవహరిస్తున్నట్లు.. ఈ వాదన బలంగా తీసుకెళ్లడానికి తెలుగుదేశం అధినాయకత్వం ఈ రకంగా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ పరిణామంతో ఇప్పుడు ఎన్నికల అయ్యేంతవరకు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరు ఏపీలోనే ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వీళ్ళతోపాటు ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారంట. తెలుగుదేశం పార్టీపై వైసీపీ వ్యవహరిస్తున్న తీరును ఎన్నికలలో సెంటిమెంట్ రూపంలో తీసుకెళ్లడానికి తెలుగుదేశం పార్టీ ఈ రకమైన ఆలోచనలతో ముందుకెళ్లబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో నారా లోకేష్ పేరు కూడా వినిపిస్తూ ఉండటంతో పాటు అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు రావడంతో టీడీపీ వచ్చే ఎన్నికలకు ఈ రీతిగా అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది.