Nara Bhuvaneswari : చంద్రబాబును జైలులో చూసి వచ్చాక మీడియాతో మాట్లాడలేకపోయిన భువనేశ్వరి
Nara Bhuvaneswari : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్. ప్రస్తుతం ఇదే ఏపీతో పాటు తెలంగాణలోనూ హాట్ టాపిక్ గా మారింది. నారా చంద్రబాబునాయుడు ఈ స్కీమ్ పేరుతో పెద్ద స్కామ్ చేశారని, ఏజెన్సీల నుంచి 118 కోట్లు కొట్టేశారని దానికి సంబంధించిన ఆధారాలను సేకరించి మరీ సిట్ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆయనకు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చంద్రబాబును జైలుకు తరలించారు. రాజమండ్రి జైలులో ప్రస్తుతం చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును చూడటం కోసం, అక్కడికి భారీగా టీడీపీ అభిమానులు తరలివస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అభిమానులు చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని నిరసన తెలుపుతున్నారు. టీడీపీ నేతలను చాలామందిని పోలీసులు నిరసన తెలపకుండా ముందస్తుగానే అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులే రౌడీలు, గూండాలుగా వ్యవహరిస్తున్నారు.చంద్రబాబును జైలుకు వెళ్లి చూసి వచ్చిన ఆయన భార్య భువనేశ్వరి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయ్యో అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. ఎప్పుడూ ప్రజలు ప్రజలు అంటారు. ఆయనకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. జైలులో కనీస సౌకర్యాలు లేవు. ఆయన ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. చన్నీళ్లతో స్నానం చేయాలంటున్నారు. ఏమాత్రం కూడా కనికరం చూపించడం లేదు.
Nara Bhuvaneswari : చంద్రబాబును చూసి కన్నీరు పెట్టుకున్న భువనేశ్వరి
. జైలులో కూడా ఆయన ఇప్పటికీ ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. ప్రజల గురించే ఆయన ఎప్పుడూ మాట్లాడేవారు. వాళ్ల అభివృద్ధి కోసం, ఏపీని దేశంలోనే నెంబర్ వన్ గా ఉండాలని ఆయన జీవితం మొత్తం మీకోసమే ధార పోశారు. కుటుంబం గురించి కూడా ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రజల గురించే ఆలోచించారు. ఇప్పుడు ఆయనే నిర్మించిన అదే బిల్డింగ్ లో కట్టి పడేశారు.. అంటూ భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు.