Ys jagan Vs Balakrishna : జగన్, బాలయ్యల మధ్య పెద్ద వారే నడవనుందా.. అందరి దృష్టి దానిపైనే..!
ప్రధానాంశాలు:
Ys jagan Vs Balakrishna : జగన్, బాలయ్యల మధ్య పెద్ద వారే నడవనుందా.. అందరి దృష్టి దానిపైనే..!
Ys jagan Vs Balakrishna : ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీ దారుణమైన ఓటమి పాలు కావడంతో ఇప్పుడు రానున్న ఎలక్షన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏ ఎలక్షన్స్‌లో కూడా పరాజయం అనేది లేకుండా ప్లాన్ చేసుకుంటున్నారు.తొందరలో హిందుపురం మునిసిపాలిటీ చైర్ పర్సన్ కి సంబంధించిన ఎన్నికలు జరగబోతుండగా, ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించారు. 2021లో జరిగిన ఎన్నికల్లో 38 మంది కౌన్సిలర్లకు గానూ వైసీపీ 30 సీట్లు గెలుచుకుంది. టీడీపీ కేవలం ఆరు వార్డులనే గెలుచుకుంది. అయితే వైసీపీకి చెందిన హిందూపురం చైర్ పర్సన్ ఇంద్రజ నెమ్మదిగా తనతో పాటు 11 మంది కౌన్సిలర్లను కూడగట్టుకుని టీడీపీలోకి వచ్చారు.
Ys jagan Vs Balakrishna జగన్ వర్సెస్ బాలయ్య
ఆమె తన చైర్ పర్సన్ పదవికి రాజీనామా కూడా చేశారు. టీడీపీ నుంచి కూడా ఆమెనే చైర్ పర్సన్ చేస్తారు అన్న ఒప్పందంతోనే ఇదంతా జరిగింది అనే ప్రచారం అయితే జరుగుతుంది.. 38 మంది కౌన్సిలర్లలో సగానికి కంటే ఎక్కువ అంటే 20 మంది ఉంటే చైర్ పర్సన్ ఈజీగా అవుతారు. ఆల్రెడీ టీడీపీకి ఆరుగురు ఉన్నారు. ఇపుడు వైసీపీ నుంచి 11 మందితో ఆ నంబర్ 17కి పెరుగుతుంది. ఇక హిందూపురం ఎంపీ ఎమ్మెల్యేతో పాటు ఇతర ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా తప్పక వారితో ఉంటారు కాబట్టి ఇప్పుడు చైర్ పర్సన్ పదవి వారికే దక్కుతుందని అందరు అనుకుంటున్నారు. వైసీపీ కూడా ఈ పదవిని దక్కించుకోవాలని చాలా సీరియస్ గా ఉంది.

Ys jagan Vs Balakrishna : జగన్, బాలయ్యల మధ్య పెద్ద వారే నడవనుందా.. అందరి దృష్టి దానిపైనే..!
అయితే వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ టీడీపీ కూటమిలోకి వెళ్ళిన 11 మందిలో నలుగురిని వెనక్కి తెచ్చి జగన్ ముందు పెట్టారు. దాంతో టీడీపీ కూటమిలో కౌన్సిలర్లు తగ్గిపోయారు. మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ మంది ఉండడంతో రంగంలోకి బాలయ్య దిగాల్సి వచ్చింది అని అంటున్నారు. ఎలాగైనా హిందూపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్ ని గెలిపించుకోవడం మీద బాలయ్య ఫోకస్ పెట్టారు. అందివచ్చిన అవకాశాన్ని బాలయ్య సద్వినియోగం చేసుకొని జగన్ పై ప్రతీకారం తీర్చుకునే పనిలో పడ్డారు. ఈ క్రమలో హిందూపురం వేదికగా జగన్ వర్సెస్ బాలయ్యగా పొలిటికల్ వారి కి రంగం సిద్ధం అయింది. ఇంతకీ హిందూపురం చైర్ పర్సన్ ఎవరు అవుతారు అన్నది చూడాల్సి ఉంది.