Chandrababu : స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకి బిగ్ ట్విస్ట్..!!
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. శనివారం ఉదయం నంద్యాలలో అదుపులోకి తీసుకున్న పోలీసులు సాయంత్రం విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించి విచారణ చేయడం జరిగింది. అనంతరం ఆదివారం ఉదయం న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి తనని రాజకీయ కక్షతో అరెస్టు చేసినట్లు న్యాయమూర్తి ఎదుట చంద్రబాబు స్వయంగా తన వాదనలు వినిపించారు.
ఈ కేసులో మొదట చంద్రబాబును ఏ1గా ప్రచారం చేయగా సిఐడి రిమాండ్ రిపోర్టు కోర్టుకి సమర్పించిన క్రమంలో చంద్రబాబుని ఏ37గా చూపించడం విశేషం. వాస్తవానికి ఈ కేసు 2021 లోనే సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ సమయంలో చంద్రబాబుని ఏ37గా చేర్చడం జరిగింది. అయితే కొన్ని రోజుల క్రితం నుండి చంద్రబాబు ప్రథమ ముద్దాయి అన్న రీతిలో ప్రచారం జరిగింది. ఇప్పుడు చంద్రబాబుని న్యాయస్థానంలో ప్రవేశపెట్టాక మళ్ళీ ఏ37గా చూపించడం ట్విస్ట్ ఇచ్చినట్లు అయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు హోరాహోరీగా ఏసీబీ న్యాయస్థానంలో వాదనలు సాగాయి.
చంద్రబాబు తరఫున భారతదేశంలోని ప్రముఖ లాయర్ లూద్ర.. వాదించటం జరిగింది. 9 సెక్షన్ల కింద కేసు పెట్టడం జరిగింది. అన్ని సెక్షన్లలో పూర్తి ఆధారితమైన సాక్షాలతో న్యాయస్థానంలో సీఐడీ ప్రవేశపెట్టడంతో చంద్రబాబుకి దారులు మూత పడినట్లు అరెస్టు గ్యారెంటీ అని ప్రచారం జరుగుతుంది.