Buddha Venkanna : లోకేష్ ప‌ట్టాభిషేకం ఫిక్స్ అయిన‌ట్టేనా.. ఆ ముహుర్తానికేన‌ట‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Buddha Venkanna : లోకేష్ ప‌ట్టాభిషేకం ఫిక్స్ అయిన‌ట్టేనా.. ఆ ముహుర్తానికేన‌ట‌..!

Buddha Venkanna : ఈ సారి ఏపీ ఎన్నిక‌లు ఎంత ర‌చ్చ‌గా మారాయో మ‌నం చూశాం. కూట‌మి ఒక వైపు, వైసీపీ ఒక‌వైపు గెలుపుటోముల మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే జ‌రిగేలా కనిపిస్తుంది. అయితే కూట‌మి గెలుస్తుంద‌ని కొంద‌రు అంటుండ‌గా, వైసీపీ అని మ‌రి కొంద‌రు అంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో యువ నాయకత్వం లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్ అయింది. 2019, 2024 ఎన్నికల్లో అది కొట్టొచ్చినట్లుగా కనిపించింది. జనసేన అధినేత పవన్ పొత్తు కలపడంతో యూత్ అంతా […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 May 2024,6:00 pm

Buddha Venkanna : ఈ సారి ఏపీ ఎన్నిక‌లు ఎంత ర‌చ్చ‌గా మారాయో మ‌నం చూశాం. కూట‌మి ఒక వైపు, వైసీపీ ఒక‌వైపు గెలుపుటోముల మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే జ‌రిగేలా కనిపిస్తుంది. అయితే కూట‌మి గెలుస్తుంద‌ని కొంద‌రు అంటుండ‌గా, వైసీపీ అని మ‌రి కొంద‌రు అంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో యువ నాయకత్వం లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్ అయింది. 2019, 2024 ఎన్నికల్లో అది కొట్టొచ్చినట్లుగా కనిపించింది. జనసేన అధినేత పవన్ పొత్తు కలపడంతో యూత్ అంతా టీడీపీ కూటమి వైపు మళ్లారు. అలా ఈ ఎన్నికల వరకూ జరిగినా దీర్ఘ కాలంలో మాత్రం టీడీపీకి యూత్ ఫేస్ అవసరం అన్నది చాలా మంది చెప్పే మాటే.

లోకేష్ వైపు బుద్దా వెంక‌న్న‌..

తాజా ఎన్నికల్లో రాయలసీమ జిల్లాలలో 46 డిగ్రీల ఎండలను సైతం ధిక్కరించి చేసిన ప్రచారం చూసిన వారు బాబు తెగువను చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అయితే ఈ వయసులో కొన్ని కీలక సభలను అడ్రస్ చేసి మిగిలిన బాధ్యతలను లోకేష్ కి అప్పగించి ఉండాల్సింది అని కూడా అన్నారు. కానీ ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు కాబట్టే బాబు అలా ఆలోచించలేదని అంటున్నారు. 2019తో పోలిస్తే ఆయన బాగానే గత అయిదేళ్లలో మమేకం అయి ప్రజలలో తిరిగారు. మరి ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు కదా అన్న చర్చకు తెర లేస్తోంది. అదే మాటను ఆ పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కూడా అనేశారు. ఇది రిక్వెస్ట్ కాదు.. మా డిమాండ్‌.. ఈ పార్టీ నారా వారి రెక్కల కష్టం.. నారా లోకేష్‌కి ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి.. చంద్రబాబు సీఎంగా, లోకేష్‌ పార్టీ చీఫ్‌గా ఒకేరోజు బాధ్యతలు చేపట్టాలి.. అంటూ తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న అన్నారు.

టీడీపీలో జూనియర్ లీడర్ల నుంచే ఎక్కువగా లోకేష్ గురించే డిమాండ్ వస్తోంది. సీనియర్లు మాత్రం బాబే 2029 దాకా టీడీపీ అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్నారు. పార్టీని నడపడం అంటే అంత ఈజీగా కాదు, ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక ఎత్తు అధికారంలో ఉన్నపుడు మరో ఎత్తుగా ఉంటుంది. . టీడీపీ కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ సవాల్ వేరేగా ఉంటుంది. సోలోగా మెజారిటీ సాధిస్తే ఆ లెక్క వేరేగా ఉంటుంది. ఏది ఏమైనా లోకేష్ సాయం తీసుకోవాల్సిందే. ఆయనకు పగ్గాలు అప్పగించాల్సిందే. కానీ దానికి సరైన ముహూర్తం ఇదేనా అంటే కాదు అనే అంటున్నారు ఎక్కువ మంది. రాజకీయ విశ్లేషకులు సైతం కొన్నాళ్ల పాటు బాబు అనుభవం పార్టీకి ప్రభుత్వానికి అవసరం అనే అంటున్నారు. చూడాలి రానున్న రోజుల‌లో ఏం జ‌రుగుతుందో..!

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది