Ys Jagan : జగన్ పాలనలో విపరీతంగా పెరిగిన పెట్టుబడులు…స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys Jagan : జగన్ పాలనలో విపరీతంగా పెరిగిన పెట్టుబడులు…స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం…!

Ys Jagan : 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు తీసుకురాలేదు.. పరిశ్రమలు తీసుకురాలేదు..ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అనేవారికి దిమ్మతిరిగే సమాధానం తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పాలనతో పోల్చి చూసినట్లయితే జగన్ పాలనలో పెట్టుబడులు మూడింతలు పెరిగాయని వెల్లడించింది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి అనే లక్ష్యాలకు కట్టుబడి […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 February 2024,12:30 pm

ప్రధానాంశాలు:

  •  Ys Jagan : జగన్ పాలనలో విపరీతంగా పెరిగిన పెట్టుబడులు...స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం...!

Ys Jagan : 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు తీసుకురాలేదు.. పరిశ్రమలు తీసుకురాలేదు..ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అనేవారికి దిమ్మతిరిగే సమాధానం తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పాలనతో పోల్చి చూసినట్లయితే జగన్ పాలనలో పెట్టుబడులు మూడింతలు పెరిగాయని వెల్లడించింది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి అనే లక్ష్యాలకు కట్టుబడి ఉన్నారు.ఎందుకంటే ఒకవైపు నవరత్నాల పేరుతో ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూనే..ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పాలి.ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అంబానీ, ఆదాని , బిర్లా వంటి కొన్ని టాప్ కంపెనీలు ఆంధ్రాలో పరిశ్రమలు ప్రారంభించడానికి ముందడుగులు వేస్తున్నాయి. ఇక ఈ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అని చెప్పాలి.అయితే జగన్ పాలనలో ఏపీ సంక్షేమం మరియు అభివృద్ధి దిశగా సాగుతున్న విపక్ష పార్టీలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నాయి.

కేవలం పథకాలను చూపిస్తూ జనాలను మభ్యపెడుతున్నారని రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించడం లేదని పెట్టుబడులు రావడంలేదని అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అలా విమర్శించే వారందరికీ గట్టి షాక్ తగిలింది.తాజాగా చంద్రబాబు పాలనలో కన్నా జగన్ హయాంలోనే ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయని ఇక ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే…చంద్రబాబు పాలనతో పోల్చి చూస్తే గడిచిన నాలుగున్నర ఏళ్లలో జగన్ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుండి రాష్ట్రంలో పెట్టుబడులు మూడింతలు పెరిగాయి.ఇక ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ( డీపీఐఐటీ ) ,వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రబాబు పాలనలో 2014 -18 కాలంలో వచ్చిన పెట్టుబడులతో పోల్చి చూస్తే 2019-23 జూన్ వరకు అంటే వైయస్ జగన్ పాలన లో దాదాపు 226.9% పెట్టుబడులు అధికంగా వచ్చాయట. ఇక 2014 -18 క్యాలెండర్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పరిశ్రమలు పెట్టుబడులు కేవలం రూ.32,803 కోట్లు మాత్రమే.

కానీ వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు రూ.1,00,103 , కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలో వచ్చాయట. అంతేకాక చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సదస్సు పేరుతో ప్రతి సంవత్సరం హడావిడి చేసి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయి అంటూ చేసిన ప్రచారాలు వాస్తవం కాదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ జగన్ ఐదేళ్ల పాలనలో వాస్తవ రూపం దాల్చిన , ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమల పెట్టుబడులే లక్షల కోట్లకు పైగా ఉన్నాయట.కానీ వీటి గురించి ఎన్నడూ జగన్ ప్రచారాలు కానీ ఆర్భాటాలు కానీ చేసుకోలేదు. అంతేకాక వాస్తవానికి దేశంలో జరిగే పెట్టుబడుల సదస్సులో జరిగే ఒప్పందాలు అన్నీ కూడా 16 నుంచి 17% మాత్రమే వాస్తవం రూపం లో ఉంటాయట. కానీ జగన్ పాలనలో అవన్నీ భిన్నంగా కనిపిస్తున్నాయి.ఎందుకంటే విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఏడాది పూర్తి కాకుండానే దాదాపు 19% పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయని ఈ గణంకాలు తెలియజేశారు. ఇలా జిఐఎస్ లో మొత్తం 13.11 లక్షలు కోట్లు విలువైన 386 ఒప్పందాలు జరగగా 2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమ పనులు వేరువేరు దశలో ఉన్నాయని సమాచారం.ఇది అంతా కూడా వైయస్ జగన్ ప్రభుత్వ కృషికి నిదర్శనమని పారిశ్రామిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇన్నేళ్లుగా పరిశ్రమలు రాలేదు , పెట్టుబడులు రాలేదు అని విమర్శించిన విపక్షాలు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది