Chandrababu : రైతులకు చంద్రబాబు తీపికబురు.. ఈ పంటలకు ఆర్థిక సాయం..!
chandrababu : ప్రస్తుతం రైతులు వరి, మొక్కజొన్న లాంటి సాంప్రదాయ పంటలే ఎక్కువగా సాగుచేస్తున్నారు. వీరిని లాభాలు ఎక్కువ.. ఖర్చు తక్కువగా ఉండే ఉద్యాన పంటలు వేసేలా ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఉద్యాన పంటలకు అనుసంధానం చేస్తే రెండు విధాలుగా లాభం ఉంటుందని సీఎం చంద్రబాబు chandrababu అంచనా వేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పంటలకు ఆర్థికంగా సహాయం అందించనున్నారు. అంతేకాకుండా అన్నదాతలకు రాయితీ కూడా […]
ప్రధానాంశాలు:
Chandrababu : రైతులకు చంద్రబాబు తీపికబురు.. ఈ పంటలకు ఆర్థిక సాయం..!
chandrababu : ప్రస్తుతం రైతులు వరి, మొక్కజొన్న లాంటి సాంప్రదాయ పంటలే ఎక్కువగా సాగుచేస్తున్నారు. వీరిని లాభాలు ఎక్కువ.. ఖర్చు తక్కువగా ఉండే ఉద్యాన పంటలు వేసేలా ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఉద్యాన పంటలకు అనుసంధానం చేస్తే రెండు విధాలుగా లాభం ఉంటుందని సీఎం చంద్రబాబు chandrababu అంచనా వేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పంటలకు ఆర్థికంగా సహాయం అందించనున్నారు. అంతేకాకుండా అన్నదాతలకు రాయితీ కూడా ఇవ్వబోతున్నారు. పంటలు సాగుచేసేందుకు అవసరమైన మొక్కలను కూడా తక్కువ ధరకే అందించనున్నారు.
ఈ పంటలు సాగు చేసే రైతులు ఆర్థికంగా ప్రయోజనాలు పొందాలంటే.. వారికి 5 ఎకరాల లోపు భూమి ఉండాలి. వారు చిన్న, సన్నకారు రైతులు అయి ఉండాలి. అలాగే వారికి బోరు లేదా సాగు నీరు అందుబాటులో ఉండాలి. కరెంటు సరఫరా ఉండాలి. ఇంకా వారి దగ్గర పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలి. 1-బీ కూడా ఉండాలి. ఇవన్నీ పరిశీలించి, తహశీల్దారు.. అర్హులో కాదో నిర్ణయిస్తారు. ఈ సందర్భంగా రైతులు తమ ఫొటో, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, ఆధార్ కార్డుల జిరాక్సులను ఉపాధి హామీ పథకం అధికారులకు ఇవ్వాలి. APO స్థాయి అధికారి వాటిని చెక్ చేసి, అన్ని అర్హతలూ ఉన్నాయి అనుకుంటే.. ఆర్థిక సాయం అందిస్తారు.
ఈ పథకం ద్వారా.. జామ మొక్కలైతే 110, నిమ్మ 110, మామిడి మొక్కలైతే 70 ఇస్తారు. అలాగే కొబ్బరి 60, సీతాఫలం 240, బత్తాయి 100, దానిమ్మ 276, సపోటా 60 మొక్కలను తక్కువ ధరకే ఇస్తారు. వీటిని తీసుకొని రైతులు.. సాగు చెయ్యవచ్చు. ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అన్నీ వ్యవసాయ అధికారులు చెబుతారు. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహణ ఖర్చుల మనీ ఇచ్చే పనిని ఉపాధి హామీ పథకం అధికారులు చూస్తారు. ఇలా దీన్ని ఉపయోగించుకొని రైతులు ముందుకు సాగవచ్చు. AP Government, cultivation, horticultural crops, horticultural