Chandrababu : నన్ను అరెస్ట్ చేయబోతున్నారు.. తప్పు ఒప్పుకున్న చంద్రబాబు? అరెస్ట్‌కు సిగ్నల్స్ ఇచ్చింది ఎవరు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : నన్ను అరెస్ట్ చేయబోతున్నారు.. తప్పు ఒప్పుకున్న చంద్రబాబు? అరెస్ట్‌కు సిగ్నల్స్ ఇచ్చింది ఎవరు?

 Authored By kranthi | The Telugu News | Updated on :7 September 2023,6:00 pm

Chandrababu : రేపో మాపో నన్ను అరెస్ట్ చేసినా చేస్తారు.. అంటూ చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్ని అరాచకాలు చేయాలో.. వాళ్లు చేసిన తప్పులన్నీ వెతికి నా మీద తప్పుడు కేసులు వేస్తున్నారు. నా మీద ఇప్పటి వరకు ఎందరో కేసులు వేసేందుకు ప్రయత్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నా మీద చాలా కేసులు వేయాలని ప్రయత్నించాడు. కానీ.. ఒక్క కేసు మీద సరైన ఆధారాలు సేకరించలేకపోయారు. నేను 45 ఏళ్ల నుంచి నిప్పులా బతికాను.. అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరి ఐటీ శాఖ ఎందుకు నోటీసులు ఇచ్చింది అంటే 118 కోట్లను దోచుకున్నాడు. వాటిపై ఐటీ రిటర్న్స్ కూడా దాఖలు చేయలేదు అనేది ప్రధాన ఆరోపణ. ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంతో సిట్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఐటీ నోటీసులు ఇచ్చినా చంద్రబాబు మాత్రం ఆ నోటీసులకు హాజరు కాలేదు. విచారణకు చంద్రబాబు ఎందుకు హాజరు కాలేదు. అంతే చంద్రబాబు తప్పు చేశారు అని ఒప్పుకున్నట్టే కదా. తాను తప్పు చేశాడు కాబట్టే విచారణకు హాజరు కావడం లేదు. ఆగస్టు 4న తనకు ఐటీ శాఖ నోటీసులు ఇస్తే ఇప్పటి వరకు చంద్రబాబు విచారణకు హాజరుకాలేదు.

chandrababu faultin scams

chandrababu faultin scams

Chandrababu : 118 కోట్లకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు?

ఐటీ శాఖ 118 కోట్లకు సమాధానం చెప్పాలని అడిగితే అప్పుడు ఎందుకు మీరు విచారణకు హాజరు కాలేదు. విచారణకు హాజరు కానప్పుడు అరెస్ట్ చేస్తారు కదా. విచారణకు చంద్రబాబు హాజరు అయి ఉంటే ఇంత దూరం వచ్చేదే కాదు. ఐటీ నోటీసుల గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు అని.. 118 కోట్ల అంశాన్ని పక్క దారి పట్టించేందుకు చంద్రబాబు ఆడుతున్న నాటకాలు ఇవి అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. మీరు నిప్పులా బతికితే కోర్టుల్లోకి వెళ్లి ఎందుకు స్టేలు తెచ్చుకున్నారు.. ఆ అవసరం ఏం వచ్చిందో యావత్ ప్రజానికానికి చెప్పండి అంటూ వైసీపీ నేతలు సీరియస్ అవుతున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది