Chandrababu Naidu : చంద్రబాబు కు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. బెయిల్ రద్దు…!
ప్రధానాంశాలు:
Chandrababu Naidu : చంద్రబాబు కు సుప్రీంకోర్టు బిగ్ షాక్.. బెయిల్ రద్దు...!
Chandrababu Naidu : గత నెలలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలమెంట్ స్కామ్ కేసు పై జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బెయిల్ మీద బయటకి రావడం జరిగింది. అయితే ఆ కేసుకు సంబంధించి జరిగిన పరిణామాలు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నాయి. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ని సవాల్ చేస్తూ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ నేరుగా సుప్రీంకోర్టులో ఈ కేసును వేసి ఈ బేయిల్ ని రద్దు చేయాలి అంటూ కోరడం జరిగింది. ఇలాంటి తరుణంలో హరి స్టాల్ వే మరియు సిద్ధార్థ రుద్ర వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడుని రిప్రజెంట్ చేస్తున్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున మొగిలి రోహిత్ వాదనలు వినిపిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చిన ఒక అంశం లోకేష్ చేతిలో ఎప్పుడు చూపిస్తుండేటువంటి రెడ్ బుక్ గురించి. ఆ రెడ్ బుక్కులో తమను ఇబ్బంది పెడుతున్న అధికారుల యొక్క పేర్లను నారా లోకేష్ మెన్షన్ చేస్తున్నారని ఇలా మెన్షన్ చేయడం అనేది ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు బెయిల్ షరతులను ఉల్లంఘించడం అవుతుంది.
కాబట్టి బెయిలని రద్దు చేయాలి అనే కోరికను కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మొగిలి రోహిత్ కి దీనికి ధర్మాసనం ఏ ప్రశ్న వేసిందంటే ఇలా ఎందుకు చేస్తున్నారు మీ వాళ్ళు దీనికి సమాధానం మీరు చెప్తారా అని హరీష్ సాల్వేని అడిగితే.. దీని గురించి రెండు వారాలలో రీజ్ వారియర్ ఇస్తామని చెప్పడం జరిగింది. లోకేష్ చేతిలో ఉన్నటువంటి రెడ్ బుక్ చంద్రబాబు బెయిల్ రద్దు కి కారణం అవుతుందా అనేది ఒక ముఖ్యమైన అంశం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే ఇరకాటంలో పడి ఉంటే ఆయన మీదనే కేసు ఉంటే అలా అనుకోవచ్చు కానీ నారా లోకేష్ నీ సిబిఐ ఒక ముద్దాయిగా పెట్టింది. అయితే లోకేష్ మాత్రం బహిరంగ సభలో రెడ్ బుక్ చూపిస్తూ మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టిన అధికారులు ఉన్నారో వారి పని చెబుతాం అంటూ చెప్పడం జరిగింది. నిజానికి లీగల్ గా వారి పై యాక్షన్ తీసుకుంటామని చెబితే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదేమో కానీ ఆయన ఏం చెబుతున్నారు అనేది సుప్రీంకోర్టు ధర్మాసనం కన్సిడర్ చేస్తుంది.
కన్సిడర్ చేసిన తర్వాత నిజంగా లోకేష్ అన్న మాటలు తప్పుగా ఉన్నట్టు అనిపిస్తే , వైలెన్స్ నేచర్ లో ఉన్నట్లు వారికి అనిపిస్తే ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు బెయిల్ పై కచ్చితంగా పడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కన్న కొడుకే ఇలా అంటున్నాడు కాబట్టి దానిని సుప్రీంకోర్టు కన్సిడర్ చేసే అవకాశం ఉంది. కాబ్బటి నారా లోకేష్ కేవలం లీగల్ గా వెళ్తాం అన్నారు తప్ప ఎవరి మీద నిర్దేశంగా ఈ మాటలు అనలేదు అని ప్రూవ్ చేయగలిగితే నారా లోకేష్ అన్న మాటలు వలన చంద్రబాబుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాలి. మరి ఎం జరుగుతుందో వేచి చూడాలి.