Chandrababu Naidu : వాలంటీర్లకు చంద్రబాబు వరాల జల్లు… అధికారంలోకి వస్తే జీతం పెంపు..
ప్రధానాంశాలు:
Chandrababu Naidu : వాలంటీర్లకు చంద్రబాబు వరాల జల్లు... అధికారంలోకి వస్తే జీతం పెంపు..
Chandrababu Naidu : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త కొత్త రాజకీయ పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వాలంటీర్ల వ్యవహారం ఆంధ్ర రాజకీయాలలో రసవత్తరంగా మారింది. దీంతో అధికార పార్టీ , ప్రత్యర్థి పార్టీలు వాలంటీర్ల వ్యవస్థ పై పలు రకాల ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వాలంటీర్ల వ్యవస్థపై స్పందించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు..ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వాలంటీర్ల వ్యవస్థను జగన్ మోహన్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని తెలియజేశారు. వాలంటీర్లు వ్యవస్థను ప్రజలకు సేవ చేయడానికి వినియోగించకుండా తన సొంత పెత్తనాలకు , తన సొంత రాజకీయాలకు వాడుకుంటున్నాడని చంద్రబాబు తెలిపారు. వాలంటీర్లు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే అని స్పష్టంగా తెలియజేశారు. కానీ జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి తద్వారా రాజకీయ లబ్ధిని పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. అందుకే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ వ్యవస్థను రద్దుచేసి…ఏవైనా పెన్షన్లు ఇవ్వాల్సి ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలతో ఇప్పించాల్సిందిగా కోరారు. అంతేకానీ ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వద్దని ఎక్కడ ఎవరు చెప్పలేదు. కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డి ముసలి వాళ్ళని తీసుకువచ్చి ఎండలో నిలబెట్టి పింఛన్ ఇవ్వకుండా మళ్ళీ వెనక్కి పంపించి శవ రాజకీయాలు చేశాడని చంద్రబాబు పేర్కొన్నారు. దీని కారణంగా వృధులు కొందరు చనిపోయినట్లుగా చంద్రబాబు తెలిపారు.
ఇక ఇప్పుడు వాలంటీర్లు అందరినీ రాజీనామాలు చేయమంటున్నాడు. దీంతో చాలామంది ఎందుకు రాజీనామా చేయాలని వ్యతిరేకించారు. అలాంటివారు ఎవరూ కూడా రాజీనామాలు చేయవద్దని చంద్రబాబు తెలియజేశారు. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. వాలంటీర్లు అందరూ కూడా వై.యస్.ఆర్ పార్టీకి సేవ చేయకుండా ప్రజలకు సేవ చేయండి…వారందరికీ కూడా టీడీపీ పార్టీ అండగా నిలబడుతుందంటూ చంద్రబాబు తెలియజేశారు. ఇదిలా ఉంటే కొత్తగా వినిపిస్తున్న వార్త వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారట. ఇది ఇలా ఉంటే రేపు ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ పైనే మొదటి సంతకం చేస్తాడట. అంటే అసలు ఆ వ్యవస్థను ఇప్పుడు ఉంచాడా తీసేసాడా అంటూ చంద్రబాబు ఎద్దెవా చేశారు. వాలంటీర్లను జగన్ మోసం చేస్తున్నాడని ,అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాడని చంద్రబాబు పేర్కొన్నారు. రాత్రి ఒక మాట పగలు ఒక మాట మాట్లాడే పరిస్థితికి జగన్ వచ్చాడని తెలిపారు.
Chandrababu Naidu : ఉగాది పండుగ వేల చంద్రబాబు హామీల వర్షం…
మా ప్రభుత్వం జగన్ లాగా చేయదని ఉగాది పండుగ సందర్భంగా మాట ఇస్తున్నాము…..మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000 కాదు ఏకంగా 10,000 పారిశోతికం వాలంటీర్లకు ప్రకటిస్తున్నానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాదు ఇంట్లో కూర్చుని 10వేల నుండి 50 వేల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశాలను మేము అందిస్తామంటూ చంద్రబాబు తెలియజేశారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని ,ప్రభుత్వ జాబులు కుడా అందిస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే వాలంటీర్లుగా ఉన్న వారికి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ కెరియర్ ను బిల్డ్ చేసే బాధ్యత నాది అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు.