Chandrababu Naidu : మంత్రి పై చంద్ర‌బాబు సీరియ‌స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu Naidu : మంత్రి పై చంద్ర‌బాబు సీరియ‌స్..!

 Authored By ramu | The Telugu News | Updated on :5 November 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu Naidu : పార్టీకి ఉప‌యోగ‌ప‌డ‌కుంటే, నీకు మంత్రి ప‌ద‌వి ఎందుకు.. చంద్ర‌బాబు సీరియ‌స్..!

Chandrababu Naidu : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక అధికారులు, నాయ‌కులు కూడా చాలా సీరియ‌స్‌గా ప‌ని చేస్తున్నారు. ఎవ‌రైన అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తే వార్నింగులు ఇస్తున్నారు AP CM ఏపీ సీఎం చంద్ర‌బాబు. ప్రభుత్వ వ్యవహారాల్లోనే కాదు, పార్టీ వ్యవహారాల్లోనూ నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోనని తరచూ చెప్పే ఆయ‌న ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇన్‌ఛార్జ్‌ నుంచి మంత్రి వరకు ఎవర్నీ వదలడం లేదు. చెప్పిన పని చెప్పినట్టుగా చేయాల్సిందేనంటూ క్లాస్ తీసుకుంటున్నారు. ఇలాంటి ఓ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అమలాపురానికి చెందిన వారు కాగా, ఆయ‌న‌ వైసీపీలో ఒక సాధారణ కార్యకర్త. నాటి మంత్రి పినిపే విశ్వరూప్‌తో పొసగకపోవడంతో పార్టీకి దూరమయ్యారు.,,

Chandrababu Naidu చంద్ర‌బాబు ఫైర్..

ఎన్నికల ముందే  Ysrcp వైసీపీలో నుంచి TDP టీడీపీలోకి మారి.. రామచంద్రపురం స్థానం సీటు పొందారు. నియోజకవర్గం కొత్తదైనా రాజకీయ దిగ్గజాలు ఉన్న నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగి ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యే ఎన్నికైన కొన్నిరోజుల్లోనే చంద్రబాబు మంత్రివర్గంలో కూడా స్థానం పొందారు. చంద్రబాబు మంత్రివర్గంలో కోనసీమ జిల్లా నుంచి స్థానం లభించిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించిన యువనేతకు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తుందని జోరుగా చర్చ జరుగుతోంది.మంత్రి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల సభ్యత్వలు నమోదు చేయించడంతో మంత్రి వెనుకబడి ఉన్నట్లు తెలుస్తొంది. ఇప్పటి వరకు కేవలం 29 శాతం మాత్రమే ఎమ్మెల్సీ ఓట్ల సభ్యత్వ నమోదు చేయించినట్లు సమాచారం. అయితే.. పట్ట భద్రుల ఎన్నికలకు సంబంధించి.. తొమ్మిది వేల మంది ఓట్ల నమోదుకు లక్ష్యంగా పెడితే కేవలం 2వేల 300 ఓట్లు మాత్రమే చేయడంతో సీఎం చంద్రబాబు నుంచి మంత్రి సుభాష్ చివాట్లు తిన్నట్టుగా తెలుస్తోంది.

Chandrababu Naidu మంత్రి పై చంద్ర‌బాబు సీరియ‌స్

Chandrababu Naidu : మంత్రి పై చంద్ర‌బాబు సీరియ‌స్..!

ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మంత్రికి ఫోన్ చేసి చివాట్లు పెట్టినట్లు సమాచారం. తొలిసారి ఎమ్మెల్యే అయిన కూడా మంత్రిగా గురుతర బాధ్యతలు అప్పగిస్తే.. ఇంత నెగ్లీజెన్సీగా ఉంటారా అని మండిపడినట్లు తెలుస్తొంది. ఇలా అయితే కుదరదని.. తాము మరో ప్రత్యామ్నాయం చూస్తానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.మరోవైపు మంత్రి యువకుడు కావడంతో సీనియర్లకు గౌరవం ఇవ్వట్లేదని మరోవాదన వినిపిస్తుంది. అయితే నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను సుభాష్ దూరంపెట్టి అమలాపురం నుండి వచ్చిన తన సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయట. తనకు ఇచ్చిన శాఖపై పూర్తి అవగాహన లేకపోవడంతో ఆ శాఖ అధికారులు‌ కూడా మంత్రి సుభాష్ ను తప్పుదోవ పట్టిస్తున్నారనే టాక్ నడుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది