Chandrababu Bail : అరెస్ట్‌కు ముందు.. బెయిల్ వచ్చిన తర్వాత చంద్రబాబు ఏం మాట్లాడారో తెలిస్తే మతిపోతుంది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu Bail : అరెస్ట్‌కు ముందు.. బెయిల్ వచ్చిన తర్వాత చంద్రబాబు ఏం మాట్లాడారో తెలిస్తే మతిపోతుంది

 Authored By kranthi | The Telugu News | Updated on :1 November 2023,12:00 pm

ప్రధానాంశాలు:

  •  వివిధ పార్టీలకూ ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు

  •  ఐటీ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు

  •  ఏపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు

Chandrababu Bail : టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి 52 రోజులు దాటింది. నెల 22 రోజుల తర్వాత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చింది. మధ్యలో ఎన్నిసార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నా ఆయన బెయిల్ ను కోర్టులు తిరస్కరించాయి. ఏది ఏమైనా చంద్రబాబుకు చివరకు బెయిల్ రావడంతో టీడీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. చంద్రబాబు అరెస్ట్ కాకముందే.. ఆయన్ను అరెస్ట్ చేస్తారని తెగ వార్తలు షికారు చేశాయి. తనను అరెస్ట్ చేస్తారని చంద్రబాబు కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు. తనను అరెస్ట్ చేయకముందే మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డున హత్య చేసే పరిస్థితికి వచ్చారు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పడం లేదు. ప్రజలకు కూడా వీళ్లు చెప్పాలి. కార్యకర్తలను కోరుతున్నాను. నేను నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రజా సమస్యలపై పోరాడుతున్నా. నన్ను అరెస్ట్ చేసి జైలులో పెట్టాలని అనుకుంటున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ప్రజా సమస్యలపై పోరాడకుండా నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. తప్పు చేస్తే వాస్తవాన్ని నిరూపించాలి. అప్పుడే కేసు పెట్టాలి. అది కూడా పెట్టకుండా ఏదో పెట్టాం అని చెప్పి కావాలని అరెస్ట్ చేస్తున్నారు. ఏదైనా కూడా న్యాయం గెలుస్తుంది అంటూ చంద్రబాబు తన అరెస్ట్ కు ముందు మీడియా ముందు వాపోయిన విషయం తెలిసిందే.

ఇక.. జైలు నుంచి విడుదల అయిన తర్వాత చంద్రబాబు తన అభిమానులతో మాట్లాడారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరంతా రోడ్డు మీదికి వచ్చి నాకోసం సంఘీభావాన్ని తెలిపారు అని చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. నా కోసం మీరు పూజలు చేశారు. నా కోసం ప్రార్థనలు చేశారు. ఎక్కడికక్కడ సంఘీభావాలు తెలిపారు. మీరు చూపించిన అభిమానం నేను నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా నా కోసం నా అభిమానులు బయటికి వచ్చారు. రోడ్ల మీదికి వచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వాళ్లు నాకోసం చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను అంటూ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

Chandrababu Bail : నేను చేసిన అభివృద్ధి అదే

నేను నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అభివృద్ధిని 52 రోజుల్లో ప్రపంచం మొత్తం వినేలా.. ప్రపంచానికి చూపించారు. ఇదే నేను చేసిన అభివృద్ధి. నేను ఆనాడు చేసిన అభివృద్ధి వల్ల నేడు కొన్ని కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. అదే నా రాజకీయ విజయం. నేను నా 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎటువంటి తప్పు చేయలేదు. ఎవరినీ చేయనీయను. అదే నా నిబద్ధత. అందుకే నా కోసం ప్రపంచమంతా ఏకం అయింది. ప్రపంచం అంతా ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వాళ్లు ఏకమయ్యారు. నా కోసం రోడ్ల మీదికి వచ్చి సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది