Chilakaluripet : చిలకలూరిపేటలో టెన్షన్.. విడదల రజిని, ప్రత్తిపాటి పుల్లారావు మధ్య ఏం జరుగుతుంది..!
ప్రధానాంశాలు:
Chilakaluripet : చిలకలూరిపేటలో టెన్షన్.. విడదల రజిని, ప్రత్తిపాటి పుల్లారావు మధ్య ఏం జరుగుతుంది..!
Chilakaluripet : మాజీ మంత్రి vidadala rajini విడదల రజనీ, చిలకలూరిపేట prathipati pulla rao ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అవినీతికి ఘనాపాటిగా మారిన చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, అక్రమ కేసులతో తనను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ Ysrcp Party మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. చిలకలూరిపేటలోని Chilakaluripet తన నివాసంలో రజిని మీడియాతో మాట్లాడారు. అక్రమ కేసులకు తాను భయపడపోనని స్పష్టం చేశారు.
![Chilakaluripet చిలకలూరిపేటలో టెన్షన్ విడదల రజిని ప్రత్తిపాటి పుల్లారావు మధ్య ఏం జరుగుతుంది](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Chilakaluripet.jpg)
Chilakaluripet : చిలకలూరిపేటలో టెన్షన్.. విడదల రజిని, ప్రత్తిపాటి పుల్లారావు మధ్య ఏం జరుగుతుంది..!
Chilakaluripet ఢీ అంటే ఢీ..
తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు prathipati pulla rao అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయని, ఆయన ఆదేశాలతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ తన కుటుంబంపై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. నిజానికి హైకోర్టు ఆదేశించకపోయినా, తన కుటుంబంపై అక్రమంగా కేసు నమోదు చేశారని చెప్పారు. కేవలం తన కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే పని చేస్తున్నారని, ఆయన ఆదేశాలతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులకు కచ్చితంగా ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు. రజిని వ్యాఖ్యలు విన్నంతనే,…ప్రత్తిపాటి ఆగ్రహోదగ్రులయ్యారు.మహిళ అని చెప్పుకుంటున్న రజిని.. ఓ మహిళగా ప్రవర్తిస్తున్నారా అంటూ రివర్స్ ఎటాక్ చేశారు.
రజిని vidadala rajini వ్యాఖ్యలపై స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చిన ప్రత్తిపాటి… చిలకలూరిపేటకు, Chilakaluripet బీసీలకు రజిని చేసింది తీరని అన్యాయమేనని ఆరోపించారు. ఐదేళ్లకే దిక్కులేని రజినీకి 30 ఏళ్ల రాజకీయం సాధ్యమేనా అని కూడా ఆయన ప్రశ్నిచారు. అన్నేసి ఏళ్లు రజిని అసలు రాజకీయాల్లో ఉంటారా? అని ఆయన ఎద్దేవా చేశారు.ఆ తర్వాత రజినీని మరింతగా టార్గెట్ చేసిన ప్రత్తిపాటి… ఘాటు వ్యాఖ్యలు చేశారు. ”ఓటేసిన ప్రజలను మోసం చేశావు. నమ్ముకుని పనిచేసిన నాయకుల్ని మోసం చేశావు. 2019 ఎన్నికల్లో నాన్న, బాబాయ్ అని పిలిచి వాళ్ళిద్దర్నీ మోసం చేసావు. తీరా ఇక్కడ ఓడిపోతావు అని తెలిసి వీళ్ళందర్నీ గాలికి వదిలేసి గుంటూరు పారిపోయావు. మళ్లీ ఇప్పుడొచ్చి ఒక బీసీని, ఒక మహిళని అని మాట్లాడుతున్నావు. సమాజంలో ఎంతో గౌరవంగా బతికే బీసీలు చేసే పనేనా నువ్వు చేసేది? గౌరవనీయ మహిళగా మహిళలు చేసే పనులేనా నువ్వు చేసింది? నువ్వు అసలు మహిళవేనా?” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలుచేశారు.