Congress : అమరావతిపై కాంగ్రెస్ ట్విస్ట్ .. అస్సలు ఊహించలేదుగా..!
Congress : ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం… వైసీపీ మూడు రాజధానులు ప్రతిపాదన చేయగా.. ఎన్నికల్లో ఆ నినాదానికి మద్దతు లభించలేదు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు అమరావతికి జై కొట్టాయి. కాగా, ఇప్పుడు అమరావతి రెండో విడత భూ సమీకరణ ప్రతిపాదనల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Congress : సంచలన కామెంట్స్..
1971లో ఇందిరా గాంధీ చేసినట్లు యుద్ధం జరుగుతుందని, లేదా 1999 లో వాజ్ పేయ్ కార్గిల్ యుద్ధం జరిగినట్లు జరుగుతుందని భావించామని చెప్పుకొచ్చారు. భారత సైనికులకు తలవంచి, వినయంగా నమస్కారాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా జోక్యం బాగా కనిపిస్తోందని విమర్శించారు. ట్రంప్ చేతిలో మోడీ కీలుబొమ్మగా మారాడని ఢిల్లీలో అందరూ అనుకుంటున్నారని పేర్కొన్నారు.

Congress : అమరావతిపై కాంగ్రెస్ ట్విస్ట్ .. అస్సలు ఊహించలేదుగా..!
ఇక అమరావతి పై హైదరాబాద్ రాజధానిలో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయని చింతా మోహన్ ప్రశ్నించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో చెప్పాలన్నారు. ఇప్పటికే 33 వేల ఎకరాలు భూములు తీసుకున్నారని.. మళ్లీ 40000 ఎకరాలు కావాలని చెప్పటం ఏంటని వ్యాఖ్యానించారు. రాయలసీమ జిల్లాల్లు మొదలుకుని, ఒంగోలు వరకు ఉన్న జిల్లాల ప్రజలందరూ బాధ పడు తు న్నారనన్నారు. రాజధాని భూ కేటాయింపుల్లో పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. సీఎం కి సరైన సలహాదారులు లేరని చెప్పన చింతా మోహన్ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో వుందన్నారు.