TDP : టిడిపి వర్గాలలో కనిపిస్తున్న అసంతృప్తి… మాకు మాత్రం ఒక టికెట్… బాబు కుటుంబానికి నాలుగా..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

TDP : టిడిపి వర్గాలలో కనిపిస్తున్న అసంతృప్తి… మాకు మాత్రం ఒక టికెట్… బాబు కుటుంబానికి నాలుగా..?

TDP  : ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ టిడిపి టికెట్ల గోల మొదలైంది.. అయితే దివంగత నేత ఎర్రం నాయుడు కుటుంబాన్ని మినహాయించి మిగిలిన అన్ని కుటుంబాలకు ఒక్క టికెట్ మాత్రమే ఇస్తామని చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ తేల్చి చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రెండు టికెట్లను ఆశిస్తున్న కొందరు టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోని చంద్రబాబు కుటుంబ సభ్యులకు మాత్రం నాలుగు టికెట్లను ఎలా ఇచ్చుకుంటారని వార్తలు […]

 Authored By aruna | The Telugu News | Updated on :11 February 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  TDP : టిడిపి వర్గాలలో కనిపిస్తున్న అసంతృప్తి... మాకు మాత్రం ఒక టికెట్... బాబు కుటుంబానికి నాలుగా..?

TDP  : ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ టిడిపి టికెట్ల గోల మొదలైంది.. అయితే దివంగత నేత ఎర్రం నాయుడు కుటుంబాన్ని మినహాయించి మిగిలిన అన్ని కుటుంబాలకు ఒక్క టికెట్ మాత్రమే ఇస్తామని చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ తేల్చి చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రెండు టికెట్లను ఆశిస్తున్న కొందరు టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోని చంద్రబాబు కుటుంబ సభ్యులకు మాత్రం నాలుగు టికెట్లను ఎలా ఇచ్చుకుంటారని వార్తలు తెరమీదకు వస్తున్నాయి.అయితే టిడిపి వర్గాలలో పరిటాల, జెసి , కేఈ,కోట్ల ,చింతకాయల, పూసపాటి వంటి కుటుంబాలు రెండేసి టికెట్లను అడుగుతున్నట్లుగా సమాచారం. అయితే వీరిలో జెసి దివాకర్ రెడ్డి తన కుమారుడు పవన్ కు అనంతపురం ఎంపీ టికెట్ అడుగుతున్నట్లుగా సమాచారం.అయితే జెసి ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి టికెట్ టిడిపి అధిష్టానం కట్టబెడుతుంది. ఇక పరిటాల కుటుంబం విషయానికొస్తే మాజీ మంత్రి సునీత కి మరియు ఆమె తనయుడు శ్రీరామ్ కు ధర్మవరం , రాప్తాడు టికెట్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నారు. కానీ రాప్తాడు టికెట్ మాత్రమే ఇస్తామని ఎవరు నిలబడతారో మీరే తేల్చుకొండి అంటూ చంద్రబాబు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక చింతకాయల కుటుంబానికొస్తే అయ్యన్నప్ప పాత్రుడు తనకు నర్సీపట్నం అసెంబ్లీ మరియు తన కుమారుడు విజయ్ కి అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. కానీ విజయ్ పై చంద్రబాబు లోకేష్ కు సానుకూలత లేకపోవడంతో అయ్యన్నకు మాత్రమే టిడిపి టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపుతోంది.ఇక కేఈ కృష్ణమూర్తి కుటుంబంలో కుమారుడు శ్యామ్ కు మాత్రమే టికెట్ ఇస్తామని టిడిపి తెలియజేసింది. ఈ క్రమంలో కేఈ ప్రభాకర్ కు టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అదేవిధంగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు ఎంపీ టికెట్ను ఆశిస్తున్నారు. అలాగే ఆయన భార్య సుజాతమ్మకు కూడా డోన్ టికెట్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నారు. కానీ డోన్ టికెట్టు మాత్రమే కోట్ల కుటుంబానికి ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విధంగా టిడిపి వర్గాలలో రెండు టికెట్లు అడుగుతున్న వారందరినీ అధిష్టానం కట్టడి చేస్తుందని చెప్పాలి.

అయితే వీరిని కట్టడి చేయటం బాగానే ఉంది కానీ ఈ సూత్రం చంద్రబాబు కుటుంబానికి వర్తించదా అనే ప్రశ్నలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. చంద్రబాబుకు కుప్పం టికెట్ , లోకేష్ కు , నందమూరి బాలకృష్ణకు హిందూపురం , ఆయన చిన్నల్లుడు భరత్ కు విశాఖ ఎంపీ లేదా ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకపోవడం ఏంటని అందరూ ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలలో ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని రూల్ పెట్టినప్పుడు అది అందరికీ వర్తిస్తుంది కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎర్రం నాయుడు కుటుంబానికి ఒక నీతి ఇతరులకు అయితే మరొకటా అంటూ టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇది టిడిపి పార్టీపై ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉందా అనేే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సీట్ల సర్దుబాటును టిడిపి ఏ విధంగా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది