Divvala Madhuri : మాడ వీధుల్లో వెడ్డింగ్ షూట్ అంటూ వార్తలు.. ఓ రేంజ్ లో ఫైర్ అయిన మాధురి..!
ప్రధానాంశాలు:
Divvala Madhuri : మాడ వీధుల్లో వెడ్డింగ్ షూట్ అంటూ వార్తలు.. ఓ రేంజ్ లో ఫైర్ అయిన మాధురి..!
Divvala Madhuri : టెక్కలి వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురీ ఈ మధ్య ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. ఓపెన్‌గా తిరిగేస్తున్నారు. తాజాగా ఇద్దరూ.. తమ సన్నిహితులతో కలిసి తిరుమలకు కూడా వచ్చారు. జంటగా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. వారు ఏం కోరుకున్నారో తెలియదు గానీ.. వారి తీరు మాత్రం వివాదాస్పదం అయ్యింది. అయితే దీనిపై సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో మాధురి ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. శ్రీవారి దర్శనానికి వెళ్తే.. ఆ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉందని.. కోర్చు తీర్పు తర్వాత పెళ్లి చేసుకుంటామని దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. అప్పటివరకూ కలిసే ఉంటామని చెప్పారు.
Divvala Madhuri హాట్ టాపిక్‌గా దువ్వాడ..
తమపై తీవ్ర విమర్శలు గుపిస్తూ ప్రసారం చేసిన ఛానెల్‌కి ఛాలెంజ్ విసిరారు మాధురి… “ఏమిటా న్యూసు.. రాసేముందు ముందూ వెనుకా ఆలోచించుకుని రాయరా..”? అని ప్రశ్నించారు. నిజాలు రాయండి.. అంతే కానీ, మీకు తోచింది, మీకు నచ్చింది, ఇతరులపై బురద చల్లాలని, ఇష్టమొచ్చిన వార్తలు రాయడం అనేది చాలా తప్పు అని సూచించారు. నిజాలు జనాలకు చూపించేవిగా ఉండాలి కానీ.. పనికిమాలిన న్యూస్ రాయడానికి కాదని రియాక్ట్ అయ్యారు. ఒకవేళ తాము నిజంగా ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకుంటే రాయాలని.. ఇష్టం వచ్చినట్లుగా వార్తలు పోస్ట్ చేయడం వల్ల అవతలి వ్యక్తి మనసు ఎంత బాధపడుతుందనేది గ్రహించరా అంటూ మాధురి ప్రశ్నించారు. తాము ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్నట్లు ప్రూవ్ చేస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని అన్నారు.
ధమ్ముంటే దువాడ శ్రీనివాస్ ను ధైర్యంగా ఎదుర్కోవాలని.. ఇలాంటి వార్తలతో డీఫేం చేయాలని ప్రయత్నించొద్దని ఆమె హితవు పలికారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం సుమారు రెండు నెలల కింద రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తమ ఇంట్లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి అక్రమంగా ఉంటున్నారంటూ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి అప్పట్లో ఇంటి ముందు నిరసన చేపట్టారు. కూతుర్లతో కలిసి ఇంటి ముందు బైఠాయించడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో వైసీపీ కూడా దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టింది. ఇంఛార్జి పదవి నుంచి సైతం తప్పించింది. అయితే కుటుంబసభ్యులు రాజీ ప్రయత్నాలు చేసినప్పటికీ సయోధ్య కుదరలేదు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు.