Vellampalli Srinivas : సంపద సృష్టి అంటే సినిమా టికెట్ ధరలు పెంచడమా.. చంద్రబాబు..? వెల్లంపల్లి శ్రీనివాస్
ప్రధానాంశాలు:
Vellampalli Srinivas : సంపద సృష్టి అంటే సినిమా టికెట్ ధరలు పెంచడమా..చంద్రబాబు..? వెల్లంపల్లి శ్రీనివాస్
సంపద సృష్టి పేరుతో ప్రజలపై కూటమి సర్కార్ పెనుభారం మోపుతోంది - వెల్లంపల్లి శ్రీనివాస్
Vellampalli Srinivas ” అధికారం చేపట్టిన కూటమి సర్కార్ “సంపద సృష్టి” అనే పేరుతో సీఎం చంద్రబాబు తీసుకుంటున్న ఆర్థిక నిర్ణయాలపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసారని పలు పత్రికలు పేర్కొన్నా, తాజాగా బహిరంగంగా వచ్చిన సమాచారం ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలోనే రూ.1.75 లక్షల కోట్ల అప్పు చేసినట్లు మాజీ మంత్రి , వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ఆరోపించారు.

Vellampalli Srinivas : సంపద సృష్టి అంటే సినిమా టికెట్ ధరలు పెంచడమా.. చంద్రబాబు..? వెల్లంపల్లి శ్రీనివాస్
Vellampalli Srinivas పవన్ సినిమా టికెట్ ధరలు పెంచడం ముమ్మాటికీ ప్రజలపై భారం మోపడమే – వెల్లంపల్లి శ్రీనివాస్
ఇది సంపద సృష్టి పేరుతో భవిష్యత్ భారం పెంచడమే అని పేర్కొన్నారు. సంపద సృష్టి పేరుతో సాధారణ ప్రజలపై భారం పెరుగుతోందని , ఇవి కాక సినిమా టికెట్ ధరలు పెంచుతూ వినోదం కోసం వచ్చే ప్రేక్షకులపై భారం వేస్తున్నారని శ్రీనివాస్ విమర్శించారు. ఇది సినీ పరిశ్రమ అభివృద్ధికి మేలు చేయకపోగా , సామాన్యుడి జేబును ఖాళీ చేయడమేనని అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు ఈ అప్పులను అభివృద్ధి పనుల కోసం వినియోగిస్తున్నామని, పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రానికి రాజధాని, పరిశ్రమలు, రోడ్లు, విద్యుత్ వంటి రంగాల్లో ప్రగతి తీసుకొస్తామని గొప్పలు చెప్పడమే కానీ ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని పేర్కొన్నారు.
సంపద సృష్టి అంటే సినిమా టికెట్ రేట్లు పెంచడమా?
మాజీ సీఎం @ysjagan 5 ఏళ్లలో 3లక్షల కోట్లు అప్పు చేస్తే, #ChandrababuNaidu వచ్చిన ఏడాదిలోనే 1.75 లక్షల కోట్లు అప్పు చేశారు… ఇదేనా సంపద సృష్టి అంటే? – మాజీ మంత్రి @VelampalliSR pic.twitter.com/9ViJOaEO6n
— greatandhra (@greatandhranews) July 27, 2025