Jr NTR : చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ స్పందించకపోవడంపై ఈ పెద్దాయన చేసిన వ్యాఖ్యలు షాక్..!!

Advertisement

Jr NTR : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు కావటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి ఏసీబీ న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. సరిగ్గా ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా టైం లేకపోవడంతో చంద్రబాబుని బయటకు తీసుకురావడానికి టీడీపీ లీగల్ సెల్ ఆపసోపాలు పడుతోంది. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టు అక్రమమని రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనలు చేపడుతున్నారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుని అరెస్టు చేసినట్లు భావిస్తున్నారు.

Advertisement

ఇక ఇదే సమయంలో జాతీయ స్థాయి నేతలు పలువురు సెలబ్రిటీలు సైతం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయటం దారుణం అని అంటున్నారు. నారా లోకేష్ కి పలువురు సెలబ్రిటీలు రజనీకాంత్ ఇంకా కొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు ఫోన్లు చేసి పరామర్శిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఖండిస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు సైతం చంద్రబాబు అరెస్ట్ పట్ల ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే అంతా బాగానే ఉన్నా గానీ ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన దర్శకులు ఇంక నిర్మాతలు మాట్లాడుతున్న ఎన్టీఆర్ స్పందించకపోవడం పట్ల నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

Advertisement
elder Man comments on Jr ntr Regarding chandrababu arrest
elder Man comments on Jr ntr Regarding chandrababu arrest

తాజాగా ఇదే విషయంపై ఏపీకి చెందిన ఓ వృద్ధుడు స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ మనసులో ఏముందో మనం చెప్పలేం. కుటుంబ విషయాలలో ఏం జరిగిందో తెలియదు. కానీ ఇటువంటి పరిస్థితులలో చంద్రబాబు అరెస్టు పట్ల జూనియర్ ఎన్టీఆర్ కనీసం స్పందించి ఉంటే అతనికి గౌరవం ఉండేదని.. దీనివల్ల ఇప్పుడు ఆయనకి కొద్దిగా ఇమేజ్ డామేజ్ అవుతుందని చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement