Ys Jagan : జగన్ పై రివెంజ్ తీర్చుకున్న మాజీ వైసీపీ నేత
ప్రధానాంశాలు:
Ys Jagan : జగన్ పై రివెంజ్ తీర్చుకున్న మాజీ వైసీపీ నేత
Ys Jagan : గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అప్పట్లో సీఎం జగన్‌కు దగ్గరయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తూ, జగన్ దృష్టిలో పట్టు సంపాదించాలన్న ఆశతో అడుగులు వేసారు. అయితే ఆయన్ను నమ్మించి పదవులు ఇవ్వకపోవడం తో పార్టీపై అసంతృప్తితో కోటంరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. అదే సమయంలో తన సోదరుడు గిరిధర్ రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకుని, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ మీద నెల్లూరు రూరల్ నుండి గెలిచారు.
YCP
Ys Jagan : కోటంరెడ్డి జగన్ పై పగ తీర్చుకునే పనిలో ఉన్నాడా..?
తాజాగా కోటంరెడ్డి జగన్ పై రివెంజ్ తీర్చుకునేపనిలో ఉన్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ కోసం జూలై 3న జగన్ నెల్లూరు రావాల్సి ఉంది. అయితే ఆయన ప్రయాణానికి అవసరమైన హెలిప్యాడ్ ఏర్పాటుకు వైసీపీ నేతలు ప్రైవేట్ స్థలాలు వెతుకుతున్న సమయంలో, కోటంరెడ్డి స్థానికులపై ఒత్తిడి తెచ్చి స్థలం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్‌కు రాజకీయంగా ఎదురుదెబ్బ ఇచ్చేందుకు ఇది సరైన అవకాశమని భావించిన కోటంరెడ్డి, పాత అపకారాన్ని తీర్చుకునేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
వైసీపీలో జగన్ పదవి ఇస్తాడని ఆశపడి చివరికి నిరాశపోయిన కోటంరెడ్డి, టీడీపీలోకి వచ్చిన తర్వాత తమ రాజకీయ భవిష్యత్తును అక్కడే గట్టి పునాది వేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరులో జరిగిన ఈ హెలిప్యాడ్ వ్యవహారంతో జగన్ పర్యటనకు ఆటంకం కలిగిస్తూ తీవ్ర రాజకీయ ప్రాధాన్యతను తెచ్చుకున్నారు. ఇది కోటంరెడ్డి పునఃస్థాపన రాజకీయంగా కూడా కనిపిస్తోంది. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో, బాబు ఆశీస్సులు పొందేందుకు కోటంరెడ్డి మరింత యాక్టివ్ అవుతున్నట్లు అంత మాట్లాడుకుంటున్నారు.