Gorantla Butchaiah Chowdary : “ఖబడ్డార్!” అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. వీడియో !
ప్రధానాంశాలు:
జగన్ - కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలు - బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
"ఖబడ్డార్!" అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి..!
Gorantla Butchaiah Chowdary : ఏపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం దశలవారీగా వెలుగులోకి వస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జే బ్రాండ్ మద్యం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టిన వారిని క్షమించకూడదని, వారికి ఉరిశిక్షే విధించాలని డిమాండ్ చేశారు. “దుబాయ్ నుంచి హైదరాబాదు వరకు జరిగిన అన్ని మద్యం లావాదేవీలు ఇప్పుడు బయటపడుతున్నాయి. నిజాలు నలుగురికి తెలిసిపోతున్నాయి” అని పేర్కొన్నారు. అంతే కాదు వైసీపీ నేతలను “ఖబడ్డార్!” అంటూ హెచ్చరించారు. “మీరు మొదలు పెట్టిన ఆటను మేమే ముగిస్తాం” అని బాలయ్య రేంజ్ డైలాగ్ పేల్చారు.

Gorantla Butchaiah Chowdary : “ఖబడ్డార్!” అంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి..!
Gorantla Butchaiah Chowdary : “మీరు మొదలు పెట్టిన ఆటను మేమే ముగిస్తాం” అంటూ వైసీపీ నేతలకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్వీట్ వార్నింగ్
ఎంపీ మిథున్ రెడ్డికి రేషన్ బియ్యం అక్రమాలకు సంబంధాలున్నట్టు ఆరోపించారు. అలాగే జగన్, కేసీఆర్ లను “తోడుదొంగలు”గా అభివర్ణించిన ఆయన, వీరు ప్రాంతీయ విభేదాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. మద్యం స్కాంలో పాత్రదారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వస్తున్న విమర్శలకు సైతం బుచ్చయ్య చౌదరి సమాధానం ఇచ్చారు.
“సింగపూర్ పర్యటన అనేది పూర్తిగా పెట్టుబడులకోసం, ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికే జరిగింది. దీన్ని విమర్శించడమంటే రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే” అని ఆయన అన్నారు. గత ప్రభుత్వం కాలంలో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కష్టంగా మారిందని, ఇప్పటికైనా చిత్తశుద్ధితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
#YSRCP నేతలు ఖబడ్దార్.. మీరు ఆట మొదలు పెట్టారు, మేము ముగిస్తాము
కులాల పేరుతో, మతాల పేరుతో కపట నాటకం ఆడటానికి #YSJagan ప్రయత్నిస్తున్నాడు
ఏమీలేని కేసుకు చంద్రబాబును 54 రోజులు జైలులో పెట్టి శునకానందం పొందారు
జగన్ మీద 12 ED కేసులు ఉన్నాయి, సీఎంగా అయన చేసిన అవినీతికి మరో 12… pic.twitter.com/68Uyl4tHBD
— greatandhra (@greatandhranews) July 27, 2025