Free Gas Cylinder : ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలెండర్లు తీసుకునేవారు తప్పక తెలుసుకోవాల్సిన సమాచారం
Free Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర Andhra Pradesh State ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు Free Gas Cylinder అందజేస్తోంది. దీపం-2 పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకంలో చేరిన లబ్ధిదారులకు కొన్ని నిబంధనలతో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా ఓ ముఖ్యమైన సూచన చేసింది. ఇప్పటివరకు ఉచిత గ్యాస్ సిలెండర్‌ను బుక్ చేసుకోని వారు ఈ నెలాఖరుకల్లా తప్పక బుక్ చేసుకోవాలని సూచించింది. గనుక ఈ గడువులోగా బుక్ చేయకపోతే, వారి హక్కుగా లభించే మూడు సిలెండర్లలో ఒకటి కోల్పోయే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం ఫ్రీ గ్యాస్ సిలెండర్ Free Gas Cylinder పథకానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు కీలక సూచనలు చేశారు. దీపం-2 పథకం ద్వారా లబ్ధిదారులు ఏడాదికి మూడు సిలెండర్లు పొందే అవకాశం ఉన్నప్పటికీ, వాటిని సకాలంలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు సిలెండర్ బుక్ చేయని లబ్ధిదారులు మార్చి 31లోగా తప్పనిసరిగా తమ మొదటి సిలెండర్‌ను బుక్ చేసుకోవాలని పౌరసరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ స్పష్టం చేశారు. ఒకవేళ ఈ గడువులోగా బుక్ చేయకపోతే, ప్రభుత్వం ఇచ్చే మూడు సిలెండర్లలో ఒకటి తగ్గించబడుతుందని తెలిపారు.

Free Gas Cylinder : ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలెండర్లు తీసుకునేవారు తప్పక తెలుసుకోవాల్సిన సమాచారం
Free Gas Cylinder : ఇప్పటివరకు ఉచిత గ్యాస్ సిలెండర్‌ను బుక్ చేసుకోలేదా..?
ఏప్రిల్ నుండి రెండో ఉచిత గ్యాస్ సిలెండర్ Free Gas Cylinder బుకింగ్ ప్రారంభం కానుండటంతో, లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా తమ మొదటి సిలెండర్‌ను బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇంకా సిలెండర్ బుక్ చేసుకోని లబ్ధిదారులు తక్షణమే చర్యలు తీసుకుని, ప్రభుత్వ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ పథకం ద్వారా వంట గ్యాస్ Gas ఖర్చును తగ్గించుకునే అవకాశం లబ్ధిదారులకు లభించనుంది.