Roja : ఈసారి ఏపీ ఎన్నికల్లో నగరిలో రోజా గెలవడం కష్టమేనా..!? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Roja : ఈసారి ఏపీ ఎన్నికల్లో నగరిలో రోజా గెలవడం కష్టమేనా..!?

Roja : ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీలలో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరికి నియోజకవర్గం సినీ హీరోయిన్ గా ఒక రేంజ్ కి ఎదిగిన రోజా రాజకీయాలలోనూ తనదైన ముద్ర చూపారు. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. కానీ రాను రాను ఆమెపై నెగెటివిటీ పెరుగుతుంది. ఆమె గెలవరు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఆమెకు టికెట్ కూడా ఇవ్వరని వైసీపీ వర్గాలు నుంచి సమాచారం బయటికి వస్తుంది. ఏపీలో రోజా ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేయించుకున్నారు. […]

 Authored By anusha | The Telugu News | Updated on :18 December 2023,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Roja : ఈసారి ఏపీ ఎన్నికల్లో నగరిలో రోజా గెలవడం కష్టమేనా..!?

Roja : ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీలలో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరికి నియోజకవర్గం సినీ హీరోయిన్ గా ఒక రేంజ్ కి ఎదిగిన రోజా రాజకీయాలలోనూ తనదైన ముద్ర చూపారు. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. కానీ రాను రాను ఆమెపై నెగెటివిటీ పెరుగుతుంది. ఆమె గెలవరు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఆమెకు టికెట్ కూడా ఇవ్వరని వైసీపీ వర్గాలు నుంచి సమాచారం బయటికి వస్తుంది. ఏపీలో రోజా ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేయించుకున్నారు. దివంగత వై.యస్.రాజశేఖర్ రెడ్డి నుంచి వై. ఎస్.జగన్ మోహన్ రెడ్డి వరకు వెరీ పవర్ఫుల్ లేడీ గా రోజా ఉన్నారు. కానీ ఇదంతా గతం. ఆమె పలుకుబడి అంతకంతకు తగ్గిపోతుందని చిత్తూరు జిల్లా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అంతర్గత విభేదాలు ఆమెను మసకబారుస్తున్నాయి.నగరిలో ఆమెకు వ్యతిరేకత బాగా పెరుగుతుంది. చివరకు ఆమెకు టికెట్ లేదు అన్న వార్తలు మోసుకొస్తున్నాయి. మంత్రి కావాలంటే ముందుగా ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్యే అవ్వాలంటే నియోజకవర్గంలో పార్టీ నేతలందరితో సఖ్యతగా ఉండాలి. కానీ రోజా స్టైల్ వేరు. నగరి నియోజకవర్గంలో ఒక్క మండలం నేతతో సఖ్యతతో ఉండరు. మాట దూకుడు, మనిషి దూకుడుగా ఉండే నగరి ఎమ్మెల్యే రోజాకు రోజురోజుకూ రాజకీయ శత్రువులు పెరిగిపోతున్నాతున్నారు. నగరి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. ఐదు మండలాలకు చెందిన నేతలు ఆమెకు వ్యతిరేకమే. ఈ ఐదు మండలాల నేతల్లో ఇద్దరు రాష్ట్ర స్థాయి పదవులు ఉన్నవారు ఉన్నారు. మిగిలిన వారు వారి వారి స్థాయిలో మండలాల్లో మంచి పట్టు ఉన్నవారు.

నగరి మున్సిపల్ చైర్మన్ తో రోజా కి గొడవలు ఉన్నాయి. జడ్పిటిసి లాంటి కీలక పదవుల్లో ఉన్నవారితోను ఇబ్బందులే. ఈసారి రోజా కి టికెట్ ఇస్తే పనిచేసే ప్రశ్నే లేదని మెజారిటీ క్యాడర్ స్పష్టం చేస్తున్నారు. నగరిలో ఆమె రెండుసార్లు స్వల్ప తేడాతోనే గెలిచారు. నగరిలో తమిళ నేతలు ఎక్కువగా ఉంటారు. రోజా భర్త సెల్వమణి తమిళుడు. ఈ తమిళ నేపథ్యం ఆమెకు ఉపయోగపడింది. ఇటీవల రజినీకాంత్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు వ్యతిరేకతకు దారితీసాయి. ఇలా ఆమె కీలక నేతలను దూరం చేసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో కలుపుకునే ప్రయత్నం చేయకుండా సొంత అభ్యర్థులను నిలబెట్టుకున్నారు. కొన్నిచోట్ల గెలిచారు కొన్నిచోట్ల ఓడిపోయారు. అయితే క్షేత్రస్థాయిలో పట్టు ఉన్న నేతలు ఆమెకు వ్యతిరేకం అయ్యారు.

నగరి నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు నివురు కప్పిన నిప్పులాగే ఉన్నాయి. దీనంతటికీ రోజా వ్యవహార శైలియే కారణం. ఎవరైనా నిలదీస్తే వారిని దూరం పెట్టేందుకు వెనుకాడదు. అధిష్టానం వద్ద తనకు పలుకుబడి ఉందని అధిష్టానం వద్దే తేల్చుకుంటామని రోజా తేల్చుకుంటామని వ్యతిరేక వర్గం ఉంటుంది. నగరి నియోజకవర్గంలో ఆమెకు ఎక్కడ అనుకూల పరిస్థితులు కనబడడం లేదు. టిడిపి హయాంలో రోజా కోసం తామంతా జైలుకు వెళ్లొచ్చామని అయినా కానీ కనికరం లేకుండా అధికారం లోకి రాగానే తమను పక్కన పెట్టిందని అక్కడి నాయకులు అంటున్నారు. ఆమె నోరు, వ్యవహారం ఏమాత్రం పొత్తు లేకపోవడంతో నగరి నియోజకవర్గంలో క్యాడర్లంతా దూరం అయ్యారు. ఆమె నియోజకవర్గంలో కన్నా పర్యటనలో ఎక్కువగా తిరుగుతున్నారు. ఇలా ఆమెపై వ్యతిరేకత ఉండడంతో ఈసారి ఎన్నికలను రోజా కి టికెట్ రావడం కష్టమే అని అంటున్నారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది